Technology: వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు సరికొత్త కమ్యూనిటీ ఫీచర్లను ఆస్వాదించవచ్చు. వాట్సాప్ మల్టిపుల్ గ్రూప్ చాట్స్‌ను నిర్వహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది, తద్వారా వ్యక్తిగత గ్రూపులు వారి అంశాలపైన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉండటంతో పాటు సభ్యులు సులభంగా టాపిక్‌లను బట్టి మధ్య మధ్యలో మారే వీలుంటుంది. సంస్థలు, క్లబ్‌లు, స్కూల్స్, ప్రైవేట్ గ్రూప్స్ మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఈ డిజైన్‌ను రూపొందించారు. ఉదాహరణకు, ఒక వినియోగదారు వారి నేబర్‌హుడ్ కోసం ఒక కమ్యూనిటీని సృష్టించవచ్చు, ఆపై ఆంశాన్ని బట్టి చర్చను వ్యక్తిగత గ్రూప్స్‌గా విభజించవచ్చు . ఒకటి గ్రూప్ యాక్టివిటీస్‌గా డివైడ్ అయితే మరొకటి పనులను నిర్వహించడం కోసం డివైడ్ చేయవచ్చు.
ప్రతి కమ్యూనిటీ ప్రధాన వార్తలను పంచుకోవడానికి మోడరేటర్‌ల కోసం ఒక అనౌన్స్‌మెంట్ గ్రూప్‌ను కలిగి ఉంటుంది. కమ్యూనిటీలకు అడ్మిన్ కంట్రోల్స్ , సబ్ గ్రూప్స్, అనౌన్స్‌మెంట్ గ్రూప్స్‌కు మద్దతు ఇవ్వడం, 32 మంది వాయిస్ , వీడియో కాల్స్ చేయడం, లార్జ్ ఫైల్ షేరింగ్, ఎమోజీ రియక్షన్స్ పోల్స్ వంటి కొత్త ఫీచర్‌లను వాట్సాప్ అందిస్తోంది. కమ్యూనిటీలకు మరింత ఉపయోగకరంగా ఉండేలా వాట్సాప్ మరిన్ని మార్పులను రూపొందిస్తోంది. వాట్సాప్ ముందుగా వాగ్దానం చేసినట్లుగా, ఒక గ్రూప్‌లో గరిష్టంగా పాల్గొనేవారి సంఖ్య 512 నుంచి 1,024కి పెంచింది. వీడియో కాల్‌లో గరిష్టంగా 32 మంది పాల్గొనవచ్చు. థార్డ్ పార్టీ సర్వీసెస్ అవసరం లేకుండానే ఒక గ్రూపు, లేదా కమ్యూనిటీ ఏ విషయం మీదైన తమ ఓటును వేయవచ్చు.
సాధారణ వాట్సాప్ చాట్‌ల మాదిరిగానే, కమ్యూనిటీ గ్రూప్స్ ఎండ్-టు-ఎండ్ ప్రైవసీని నిర్ధారిస్తాయి. ఎక్కడా లేనివిధంగా గోప్యంగా, భద్రతతో సంస్థలు కమ్యూనికేట్ చేసుకునే సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమని వాట్సాప్ హైలైట్ చేసింది. తాజా వాట్సాప్ వెర్షన్ కొత్త ఫీచర్లను వినియోగదారులు కొత్త కమ్యూనిటీల ట్యాబ్ లలో చూడవచ్చు.అయితే ఇక్కడ గమనించ వలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫేస్‌బుక్ గ్రూప్స్‌లాగా ఈ గ్రూప్స్ సెర్చ్ చేస్తే కనిపించవు. వాట్సాప్ కమ్యూనిటీలు గోప్యతనుపాటిస్తాయి. గ్రూప్ అడ్మిన్ గ్రూప్‌లో చేరడానికి అనుమతి ఇస్తే తప్పితే యూజర్ చేరడానికి వీలుండదు. అంటే ఇందులో ఎలాంటి సెర్చ్‌లు గానీ డిస్కవరీ ఫీచర్లు కానీ ఉండవు. 15 దేశాలలోని 50 సంస్థల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి ఈ కొత్త కమ్యూనిటీ ఫీచర్ వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా అభివృద్ధి చేయబడింది. రాబోయే నెలల్లో కొత్త ఫీచర్‌లను జోడిస్తూ దానిపై పని చేస్తూనే ఉంటామని వాట్సాప్ బృందం హామీ ఇచ్చింది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా సమర్పించవచ్చు.