Tue. Jan 20th, 2026

    Health Tips: ఇటీవల కాలంలో పది మందిలో 8 మంది బాధపెడుతున్న సమస్యలలో షుగర్ ఒకటి. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ మధుమేహ వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు అయితే ఈ సమస్య మొదట్లోనే గుర్తిస్తే మనం ఎన్నో జాగ్రత్తలను తీసుకొని వెసులుబాటు ఉంటుంది అయితే ఈ సమస్యను మొదట్లో ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే షుగర్ సమస్య కనుక మనకు వచ్చినట్లయితే కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తాయి. మరి ఆ లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే..

    మధుమేహం ఉన్నవారిలో తరచూ నోరు మొత్తం పొడి భారీ పోతుంది. ఎప్పుడైతే నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గడం వల్ల నోరంతా ఇలా పొడిగా ఉంటుంది.రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల నోట్లో లాలాజల ఉత్పత్తి తగ్గుతుందని అదే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.పొడిబారిన నోరు మధుమేహంకు ఒకహెచ్చరిక సంకేతం. అదనంగా నోటిలో లాలాజలం తక్కువైతే మీ దంతాలు, చిగుళ్ళలో సమస్యలకు దారితీస్తుంది.

    ఇక లాలాజలం ఉత్పత్తి తగ్గడమే కాకుండా అధికంగా దాహం వేయడం తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం వంటివి కూడా మధుమేహ లక్షణాలని చెప్పాలి.షుగర్‌ ఉన్న వారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. షుగర్‌ వ్యాధితో బాధపడేవారు అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. కంటి చూపు స్పష్టత తగ్గితే షుగర్ వచ్చినట్టే అంటున్నారు. ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు మానసికంగా కూడా ఎంతో కృంగిపోతారు. అదే విధంగా కాళ్లలో మంటలు రావడం వంటివి కూడా మధుమేహ వ్యాధి లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనుక మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఎంతో మంచిది.