Fever: ఇటీవల కాలంలో చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ముక్క లేనిదే కొంతమందికి ముద్ద కూడా దిగదు. అంతగా చికెన్ ఇష్టపడుతూ ప్రతిరోజు వారి ఆహారంలో చికెన్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలా చికెన్ తినడం కొంతవరకు మంచిదే అయినప్పటికీ మితిమీరి తినటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య ప్రయోజనాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే చాలామంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని చెబుతూ ఉంటారు.
మరి కొంతమంది మాత్రం ఇలాంటి మాటలను లెక్కచేయకుండా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటారు అయితే నిజానికి జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినడం మంచిదేనా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి నిపుణులు పలు విషయాలను వెల్లడించారు. మనకు జ్వరం వచ్చినప్పుడు వీలైనంత వరకు చికెన్ తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జ్వరం వచ్చినపుడు నోరు మొత్తం చేదుగా ఉంటుంది అలాంటప్పుడు చికెన్ తినాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఇలాంటి కోరిక ఉన్నవారు తక్కువ మసాలాలు ఉప్పు కారం వేసుకొని బాగా ఉడికించి చికెన్ ని తినవచ్చు అది కూడా తక్కువ పరిమాణంలో తినడం మంచిది. అలాకాకుండా అనారోగ్యానికి గురైనప్పుడు చికెన్ తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గ్రిల్డ్ చికెన్, చికెన్ ఫ్రై, బిర్యానీ వంటి పదార్థాలను స్పైసీగా చేసుకుని అసలు తినకూడదు. ఇలా ఎక్కువ ఘాటుగా మసాలాలను జోడించి తినటం వల్ల జీవ క్రియ సమస్యలు ఏర్పడటమే కాకుండా కడుపులో మంట సమస్యలు వెంటాడుతాయి. అందుకే వీలైనంత వరకు చికెన్ తినక పోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.