Vomtings: సాధారణంగా చాలామంది ప్రయాణం చేయడానికి ఎంతో ఇష్టంగా చూపుతూ ఉంటారు. ఇలా ప్రయాణం అంటే ఇష్టమైనవారు ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ వెళుతుంటారు కానీ కొంతమందికి మాత్రం ప్రయాణం అంటే అసలు పడదు కొంత దూరం వెళ్ళగానే పెద్ద ఎత్తున తల తిప్పడం వాంతులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివారు ఎక్కడికి రావడానికి కూడా ఇష్టపడరు. ఇలా ప్రయాణంలో వాంతి కలిగిన భావన రావడం లేదంటే మాటిమాటికి వాంతి చేసుకోవడం వంటివి కనుక తలెత్తుతున్నాయి అంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.
చాలామంది వాంతి రాకుండా ఉండడం కోసం ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినకుండా కాళీ కడుపుతోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. అదేవిధంగా చాలామంది నిమ్మకాయను పక్కనే పెట్టుకొని వాసన చూస్తూ ఉంటారు. ఇవే కాకుండా వాంతి రాకుండా ఉండడానికి ప్రయాణంలో ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు. మీరు ఎక్కడైనా దూరంగా ప్రయాణం చేయాలి అనుకుంటున్నారు అంటే ముందుగా తక్కువ మోతాదులో ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అలాగే నీటిని తరచు తాగుతూ ఉండాలి. ఇక ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా విండోస్ సీట్ పక్కన కూర్చోవడం మంచిది. ఇక మీకు ఏసీ పడకపోతే బయట గాలి వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోండి.
ఇక ప్రయాణంలో పొరపాటున కూడా మొబైల్ ఫోన్ చూడకూడదు ఇలా మొబైల్ ఫోన్ చూడటం వల్ల వాంతి కలిగిన భావన తలనొప్పి వంటివి వస్తాయి. వీలైనంతవరకు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మ్యూజిక్ వింటూ నిద్రపోవడం మంచిది లేదంటే ఏదైనా పుస్తకాలు చదవడం మంచిది. ఇక ప్రయాణ సమయంలో వీలైనంతవరకు ఎక్కువ మసాలా కారం కలిగిన ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల మన ప్రయాణం ఎంతో హాయిగా సాగుతుంది.