Vitamins: సాధారణంగా చాలామంది దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా దగ్గుతో బాధపడేవారు వారాలు తరబడి నెలలు తరబడి దగ్గుతూ ఉంటారు ఎన్ని చికిత్సలు తీసుకున్న అలాగే ఎన్నో ఇంగ్లీష్ మందులు అలాగే ఆయుర్వేద మందులు వాడినా కూడా దగ్గు మాత్రం తగ్గదు. చాలామందికి దుమ్ముదూలి కారణంగా వచ్చే అలర్జీ వల్ల ఇలాంటి పొడి దగ్గు సమస్య ఏర్పడుతుంది.. ఇక మరికొందరికి వాతావరణ మార్పులు కారణంగా కూడా దగ్గు వస్తుంది అయితే ఈ దగ్గు వస్తే కనుక మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది.
ఇకపోతే మనం ఎన్ని మెడిసిన్స్ వాడిన మనకు దగ్గు తగ్గలేదు అంటే అందుకు కారణం విటమిన్స్ లోపం అనే చెప్పాలి.మన శరీరంలో ఎప్పుడైతే బి-12 విటమిన్ లోపిస్తుందో అలాంటి వారికి నెలలు తరబడి పొడి దగ్గు సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇలా ఈ సమస్య అధికంగా వేధిస్తుంటే కనుక వెంటనే డాక్టర్లను సంప్రదించే సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
విటమిన్ బి 12 లోపల కారణంగా కేవలం పొడి దగ్గు సమస్య మాత్రమే కాకుండా తలనొప్పి, డిప్రెషన్, మగతగా కనిపించడం, కడుపు సమస్యలు, కండరాల తిమ్మిరి వంటి మొదలైన సమస్యలు వస్తాయని తెలుస్తుంది. ఇలా ఎవరైతే బి-12 విటమిన్ లోపంతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.రోజువారీ ఆహారంలో చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.