Viral Fever: వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా వర్షాలు కూడా విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో దోమల వ్యాప్తి కూడా అధికంగా ఉంది. దీంతో పెద్ద ఎత్తున వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతున్నాయి. ఇలా వైరల్ ఫీవర్ కారణంగా ఆసుపత్రులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. ఇలా వర్షాలు అధికంగా పడటం వల్ల ఎంతోమంది డయేరియా కలరా వంటి వ్యాధులకు గురికావడమే కాకుండా తీవ్రమైన జ్వరం బారిన పడుతున్నారు.
ఇలాంటి సమయంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్ అంటువ్యాధి. ఇది చాలా ఈజీగా వేరే వారికి సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరల్ జ్వరం వచ్చిన వ్యక్తి దగ్గినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ నోటి నుంచి వెలువడే తుంపరలలో ఉండే బ్యాక్టీరియా వేరే వ్యక్తి శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఇలా విజృంభిస్తున్నటువంటి ఈ వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయానికి వస్తే..జ్వరం, నీరసం , చలి, లో బీపీ, గొంతునొప్పి, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, గొంతు మంట,చర్మం దద్దుర్లు, వాంతులు వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మీలో కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి. వైరల్ ఫీవర్ వచ్చిన పిల్లల్లో ఇమ్మ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నప్పుడు వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం. అలాగే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ వ్యాధులను అరికట్టగలము.