Vijayakanth : తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఇక లేరన్న వార్త కోలీవుడ్ ను కుదిపేస్తోంది. గత కొన్నాళ్లుగా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న విజయకాంత్ ఇవాళ ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. కొన్నేళ్ల విజయకాంత్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్నారు విజయకాంత్. అప్పటి నుంచి ఆయన డీఎండీకే పార్టీ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా అసెంబ్లీ ఎలక్షన్లలోనూ ఆయన ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో విజయకాంత్ లేకపోవడంతో ఆయన భార్య ప్రేమలత పార్టీని నడిపిస్తున్నారు. అయితే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న విజయకాంత్ దగ్గు, జ్వరం, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు రావడంతో నవంబర్ నెల 18న చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ మియాట్ లో చేరారు. అనంతరం ఆయన డిసెంబర్ 12న హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ చేశారు.
కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్న విజయకాంత్ ను మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మరోసారి ఆయన్ను కుటుంబసభ్యులు మంగళవారం మియాత్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మెడికల్ టెస్టుల్లో విజయకాంత్‌కు కరోనా వచ్చినట్లు నిర్ధారించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఆయన్ని వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ అందించారు. ఈ క్రమంలోనే విజయకాంత్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఇవాళ ఉదయం విజయ్‌కాంత్ మరణించారు.
విజయకాంత్ స్వస్థలం తమిళనాడులోని మధురై. ఆయన 1952లో ఆగస్టు 25న జన్మించారు. ఆయన అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. MA కాజా డైరెక్షన్ లో 1979లో రిలీజైన ఇనికి ఇలమై అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. ఆయన ఎక్కువగా SA చంద్రశేఖర్ డైరెక్షన్ లో చాలా సినిమాలు చేశారు. 1980లలో విజయకాంత్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపును సాధించారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్. ఇప్పటికీ ఈ మూవీ తమిళ క్లాసిక్‌గా క్రేజ్ ఉంటుంది. ఈ సినిమాతో ఫ్యాన్స్ ఆయన్ని కెప్టెన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. కోలీవుడ్ లో ఇప్పటి వరకు ఆయన 154 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన లాస్ట్ మూవీ విరుదగిరి. 2010లో విడుదలైన ఈ మూవీని విజయ్‌కాంత్ డైరెక్ట్ చేశారు. విజయకాంత్ కుమారుడు షణ్ముఖ పాండియన్ నటించిన సాగపథం మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించారు.