Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి ముందు దీపాలను వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటాము ఇలా దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఉండడమే కాకుండా ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మనపై ఉంటుందని భావించి ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పూజ సమయంలో చాలామంది మట్టి ప్రమిదలు ఉపయోగిస్తారు. మరి కొందరు ఇత్తడి మరి కొందరు స్టీల్ లేదా వెండి ప్రమిదలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
ఇకపోతే ఈ దీపారాధన చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా వారికి తోచిన విధంగా వారు దీపారాధన చేసుకొని భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు అయితే దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అయితే దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని అవి పాటించినప్పుడే మనం చేసిన పూజకు ప్రతిఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. మరి దీపారాధన చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే..
ప్రతిరోజు తల స్నానం చేసే దీపారాధన చేయాలని నియమం ఏమీ లేదు. మామూలు స్నానం చేస్తే చాలు. ఎప్పుడూ కూడా ఇనుప ప్రమిదలో దీపం పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండి, లేదంటే మట్టి వాటిలోనైనా దీపం పెట్టొచ్చు. దీపపు ప్రమిదనే ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు. దీపారాధన చేసే సమయంలో ఆ ప్రమిద కింద తప్పనిసరిగా ఏదో ఒక ఇత్తడి కంచం లేదా ఆకునైన ఆధారంగా పెట్టాలి. అలాగే ప్రమిదకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక దీపారాధనకు ఆవు నెయ్యి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె ఎంతో శ్రేష్టమైనది ఈ నూనెతో దీపారాధన చేయటం మంచిది.