Vastu tips: సాధారణంగా మనం మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎన్నో ఆచారాలు వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను చూడటం వల్ల శుభం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అలాగే ఉదయం నిద్ర లేవగానే మరికొన్ని వస్తువులను అసలు చూడకూడదని చెబుతూ ఉంటారు. అయితే ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను చూడటం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి నిద్ర లేవగానే చూడాల్సిన ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే..
ఉదయం నిద్ర లేవగానే మనం సీతాకోక చిలుకలను కనుక చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుంది. సీతాకోకచిలుకలు మన జీవితంలో జరిగే మార్పులు ఆధ్యాత్మిక పెరుగుదలతో సంబంధం కూడుకొని ఉంటుంది అందుకే ఉదయం లేవగానే సీతాకోకచిలుకలను చూడటం మంచిది. అదేవిధంగా ఉదయం లేవగానే సూర్యోదయాన్ని చూడటం ఎంతో మంచిది సూర్యోదయం చీకటిని తరిమేస్తూ వెలుగులు నింపుతూ ఉంటుంది అలాగే మన జీవితంలో ఉన్న చీకటి కూడా తొలగిపోతుందని చెబుతూ ఉంటారు.
ఉదయం నిద్ర లేవగానే ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను చూడటం కూడా ఎంతో మంచిది.ఈ దృశ్యాన్ని చూస్తే జీవితంలో కొత్త ఆశలు, ఆనందం కలుగుతాయి. ఇక ఉదయం లేవగానే నీలిరంగు ఆకాశాన్ని చూడటం వల్ల మన మనసుకు శాంతి ఓదార్పు కలుగుతుంది అందుకే ఉదయం లేవగానే ఈ వస్తువులను చూడటం ఎంతో మంచిది అని పండితులు చెబుతున్నారు.