Venkatesh Maha: కేజీఎఫ్ఫ్ చాప్టర్ 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా సినిమాటిక్ స్టాండర్డ్స్ లో లోతులని టచ్ చేస్తుంది అనేది చాలా మంది చెప్పే మాట. అయితే కొంత మంది మాత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 ఒక పంక్తు కమర్షియల్ సినిమా అని విమర్శలు చేస్తూ ఉంటారు. కంటెంట్ లో దమ్ము లేకపోయిన కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఎలిమెంట్స్ తో సినిమా నడిచేసింది అనేది వారి వాదన. అందులో భాగంగా తాజాగా టాలీవుడ్ దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ సిరీస్ లో రాఖీ భాయ్ పాత్రని విమర్శలు చేశారు. పాత్రపై చేసారనే కంటే ఆ ఐడియాని బిల్డ్ చేసిన ప్రశాంత్ నీల్ పైన అతను విమర్శలు చేసారని చెప్పొచ్చు.
అయితే ఈ మూవీలో రాఖీభాయ్ పాత్ర భాషలతో ప్రమేయం లేకుండా అందరికి నచ్చింది. ఇక కన్నడ ప్రేక్షకులు అయితే భాగా కనెక్ట్ అయిపోయారు. దీంతో వెంకటేష్ మహా కాస్తా పరుషంగా, వ్యంగ్యంగా రాఖీభాయ్ పాత్ర గురించి మాట్లాడటంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో ట్విట్టర్ లో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే అతని పేరు మీద హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. అందులో మెజారిటీగా కన్నడ అభిమానులు అయితే వెంకటేష్ మహాని మీమ్స్ తో సహా వేసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న దర్శకులని కూడా ట్రోల్ చేశారు.
ఒకటి అర సినిమాలు చేసి అందులో చెత్త మూవీస్ చేసిన మీరు ఎలా టాలెంటెడ్ డైరెక్టర్స్ అయ్యారు అంటూ వారిపై విమర్శలు చేశారు. వెంకటేష్ మహా విమర్శలు చేసే సమయంలో వారందరూ కూడా నవ్వడం కూడా ఒక కారణం అని చెప్పాలి. ఇక ఆ ఇంటర్వ్యూ వీడియోకి కూడా స్ట్రైక్ లు కొట్టడం స్టార్ట్ చేశారు. అయితే దీనిపై దర్శకురాలు నందినిరెడ్డి ముందు రెస్పాండ్ అయ్యి సారీ చెప్పింది. దానికి ఎవరూ క్షమించలేదు.
ఇక తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా ఒక వీడియో చేసి అందులో తన మాటలు కాస్తా శృతి మించి ఉన్నాయని తాను ఒప్పుకుంటున్నా అని చెప్పారు. అలాగే కొన్ని అసందర్భంగా మాట్లాడిన మాటలని కచ్చితంగా వెనక్కి తీసుకుంటున్నా అని పేర్కొన్నారు. అయితే తాను ఒక భాషకి సంబందించిన సినిమాపై విమర్శలు చేయలేదని, ఆ సినిమాపై తన అభిప్రాయం మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. తన అభిప్రాయానికి కట్టుబడి ఉంటూనే ఎక్స్ ప్రెస్ చేయడంలో జరిగిన పొరపాటుకి క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.