Vata Savitri Vratham: మన హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ట మాసంలో వచ్చే అమావాస్య రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది మే 19 న వట సావిత్రి వ్రతాన్ని జరుపుకుంటారు. అలాగే ఈ రోజు శనీశ్వరుడి జయంతి కూడా జరుపుకుంటారు. ఈ రోజున మర్రి చెట్టు కింద ప్రత్యేక పూజలు చేస్తారు. మర్రి చెట్టు కింద కూర్చుని సావిత్రి, సత్యవంతుని కథ విని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పచ్చి నూలు కట్టాలి. వీటితో పాటు నూలును మెడలో కూడా వేసుకోవాలి.
అలాగే ఈ రోజున మహిళలు ఉపవాసం చేయడం వల్ల భర్త జీవితం సుదీర్ఘంగా ఉంటుందని ప్రజల నమ్మకం.
అందువల్ల ప్రతీ ఏటా జ్యేష్ట మాసంలో అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం జరుపుకుంటారు. సావిత్రి వ్రతం వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం మద్ర దేశపు రాజర్షి అశ్వపతి ఏకైక సంతానం సావిత్రి.. రాజు ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు ని వివాహాం చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే సత్యవంతుడు అల్పాయుష్కుడని వివాహం చేసుకున్న ఏడాదికే మరణిస్తాడని నారదుడు చెప్పినా కూడా సావిత్రి సత్యవంతుడిని పెళ్లి చేసుకుంటుంది. సత్యవంతుడికి, అతడి కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించడం ప్రారంభించింది. అయితే సంవత్సరం గడవడానికి ఇంకా నాలుగు రోజులు ఉండగా…సావిత్రి ఉపవాస దీక్ష ప్రారంభిస్తుంది.
నాలుగో రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో సత్యవంతుడి ప్రాణాలు హరించటానికి యమధర్మరాజు వస్తే సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లొద్దని సావిత్రీ యమరాజును ప్రార్థిస్తుంది. కానీ యమరాజు ఒప్పుకోలేదు.దీంతో సావిత్రి అతడిని అనుసరించడం ప్రారంభిస్తుంది. అయితే సావిత్రి ధైర్యసాహసాలకు, త్యాగానికి ముగ్దుడైన యమరాజు మూడు వరాలు ప్రసాదిస్తాడు.
Vata Savitri Vratham:
సత్యవంతుడి అంధ తల్లిదండ్రులకు కళ్లకు వెలుగును ప్రసాదించమని, కోల్పోయిన వారి రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని.. అలాగే తనకు 100 కుమారుల వరం కోరింది.దీంతో సత్యవంతుడు తీసుకెళ్లడం అసాధ్యమని యముడికి అర్థమై వెళ్ళిపోతాడు. ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రిచెట్టు కింద కూర్చుంటుంది.అందుకే ఈరోజున స్త్రీలు తమ కుటుంబం, జీవిత భాగస్వామి దీర్ఘాయుష్షును కాంక్షిస్తూ మర్రిచెట్టుకు దారాన్ని చుట్టి , పసుపు,కుంకుమ పెట్టీ పూజిస్తారు.