Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి భగవంతుడిని పూజిస్తూ ఉంటాము. ఇలా ఇంట్లో దీపారాధన చేయటం వల్ల సుఖసంతోషాలు ఇంట్లో మనశ్శాంతి ఉంటుందని భావిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే దీపారాధన చేయడం కోసం ఒక్కొక్కరు ఒకోరకమైన నూనె ఉపయోగిస్తూ ఉంటారు కొందరు ఆవనూనె ఉపయోగించగా మరికొందరు నువ్వుల నూనె ఆముదం వంటి నూనె ఉపయోగించి పూజ చేస్తూ ఉంటారు.
ఇలా వివిధ రకాలుగా నూనె ఉపయోగించి పూజ చేయడం మంచిదేనా అసలు పూజకు ఏ నూనె వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే మనకు ఏ నూనె అయితే అందుబాటులో ఉందో అలాంటి వాటితోనే పూజ చేస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఏ నూనెతో పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం..
సాధారణంగా చాలామంది ఆముదపు నూనెతోనే దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా ఆముదం నూనెతో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయి. ఇక ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శత్రువుల పీడ, వివాదాలు, కోర్టు పనులు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇక అప్పుల సమస్యతో బాధపడేవారు అప్పుల నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా ఒక్కో నూనెతో దీపారాధన చేయటం వల్ల ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి.