Vastu Tips: మన హిందూ సాంప్రదాయాలలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి అంటే కొన్ని వాస్తు పద్ధతులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఇలా వాస్తు నియమాలను పాటించినప్పుడే మనం లక్ష్మీదేవి కరుణ కటాక్షాలకు పాత్రులవుతాము.ఇక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే మన ఇంటి ప్రధాన ద్వారం ఎంతో శుభ్రంగా ఉండాలి.
మన ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులు అనుకూల శక్తులన్నీ కూడా ప్రధాన ద్వారం గుండానే వస్తాయి కనుక ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం మంచిగా శుభ్రంగా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా బయటకు వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.మరి ఇంట్లో అన్నీ కూడా అనుకూల వాతావరణ పరిస్థితిలు ఉండాలి అంటే ప్రధాన ద్వారం వద్ద ఏం చేయాలి అనే విషయానికి వస్తే..ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వ్యక్తులు లేదా ఇంట్లోకి వస్తున్నటువంటి వ్యక్తులు మన ఇంటి వైపు చూడగానే వారి దృష్టి బయట ప్రధాన ద్వారం వద్ద ఉంచిన నీటి కుండపై పడేలా చర్యలు తీసుకోవాలి.
Vastu Tips:
మన ఇంటి ప్రధాన ద్వారం బయట నీటితో నిండినటువంటి తొట్టె లేదా కుండా ఉండడం ఎంతో మంచిది.పూర్వకాలంలో ఇలా ఇంటి బయట తప్పనిసరిగా బావులు ఉండేవి ప్రస్తుత కాలంలో బావులు లేకపోవడం వల్ల ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా నీటిని నిల్వ చేసి పెట్టడం వాస్తు పరంగా ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. ఇలా ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా నీరు ఉండటం వల్ల ఆ ఇంటిలోకి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఆనందం ఉంటుంది అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది.ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎప్పుడూ కూడా నీరు ఉండడం ఎంతో ముఖ్యం.