Vastu Tips: సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఇలా పవిత్రమైన మొక్కలకు పూజలు చేస్తూ కొందరు దైవ సమానంతో వాటిని పూజిస్తూ ఉంటారు. ఇలా మొక్కలను పెంచడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే మొక్కలను దానం చేయడం ఎంతో మంచిది. ఇకపోతే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కొన్ని మొక్కలు మన ఇంటి ఆవరణంలో పెరుగుతుంటాయి.
ఈ విధంగా మన ఇంటి ఆవరణంలో కానీ ఇంటి బయట కానీ మనం నాటకపోయినా కొన్ని మొక్కలు మొలకెత్తుతూ ఉంటాయి. ఇలాంటి మొక్కలు కనుక మొలికెత్తితే వెంటనే వాటిని తొలగించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. వేప చెట్టుకు మన శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇలాంటి వేపచెట్టు మన ప్రమేయం లేకుండా మన ఇంటి ఆవరణంలో కనకం మొలచింది అంటే ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి విముక్తి పొందుతారని అర్థం.
Vastu Tips:
బయట లేదా ఆలయాలలో ఉన్నప్పుడు పూజించిన కానీ ఇంట్లో పెరగడం ఆ శుభం భావిస్తూ ఉంటారు. మన ప్రమేయం లేకుండా మన ఇంటి ఆవరణంలో తెల్ల జిల్లేడు చెట్టు కనుక మొలిచింది అంటే వెంటనే దానిని తొలగించడం మంచిది. లేకపోతే కుటుంబ సభ్యులపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఇలా ఇంటి ఆవరణలో గనుక తెల్ల జిల్లేడు చెట్టు మొలిస్తే వెంటనే దానికి పసుపు కుంకుమతో పూజించి ఆ చెట్టును తీసుకెళ్లి దూరంగా పాతి పెట్టడం మంచిది.