Vastu Tips: ప్రస్తుత కాలంలో మనిషి జీవించటానికి డబ్బు చాలా అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. మరి కొంతమంది కష్టపడుతూ డబ్బులు సంపాదించినా కూడా ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది దీంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇబ్బందులు తగ్గిపోయి ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంటారని పండితులు చెబుతున్నారు. మరి ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయానికి వస్తే…
తరచూ ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో పరిహారం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అందుకోసం శుక్రవారం రోజున ఒక వెండి బాక్స్ తీసుకొని అందులో ఎనిమిది తామర పువ్వు గింజలను ఉంచాలి. అలాగే ఐదు ఏలకులు, ఐదు కర్పూరం బిళ్ళలు, కొంచెం కుంకుమపువ్వు వేయాలి. ఆ తర్వాత ఐదు రూపాయి బిళ్ళలు కూడా నీటితో శుభ్రం చేసి అందులో వేయాలి. ఆ తర్వాత ఆ వెండి బాక్స్ ని దేవుడి గదిలో ఉంచి కనకధారా స్తోత్రం చదివి ధూపం వేయాలి.
Vastu Tips:
ఇలా పూజ చేసిన తర్వాత ఆ బాక్స్ దేవుడి గదిలోనే పెట్టాలి. అయితే మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత దీప దీపాలు వెలిగించి ఆ బాక్స్ లో వేసి ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఒక ఎర్రటి వస్త్రంలోకి పోసి మూట కట్టాలి. ఆ మూటను వెండి బాక్స్ లోనే పెట్టి జాగ్రత్తగా మనం ఎక్కడైతే డబ్బు దాచుకుంటామో ఆ ప్రదేశంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని,ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.