Vastu Tips: ప్రతి ఒక్కరూ ఇంట్లో సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా ఇంట్లో సిరిసంపదలు కలగడం కోసం ఎన్నో విధాల పరాలను పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు సిరిసంపదలు కలగాలంటే మన పూజ గదిలో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉండాలని భావిస్తారు. ఇలా పూజ గదిలో ఈ వస్తువులు కనుక ఉంటే ఆ ఇంట్లో సిరిసంపదలు ఎప్పుడూ ఉంటాయని పండితులు చెబుతున్నారు మరి పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
పూజ గదిలో తప్పనిసరిగా ఉంచాల్సిన వస్తువులలో గంట కూడా ఒకటి. పూజా సమయంలో గంట మోగించి హారతి ఇస్తారు. అందువల్ల ప్రతి ఇంట్లో పూజ గదిలో గంట తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడు ముందు దీపం వెలిగించి హారతి ఇస్తూ ఉంటారు. ఇలా దీప హారతి ఇవ్వటానికి ముఖ్య కారణం దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించి ఇలా దీపాన్ని వెలిగించి హారతి ఇస్తారు. ఇలా హారతి కర్పూరం ఇవ్వటం వల్ల అహంకారం తొలగిపోతుందని భావిస్తారు.
Vastu Tips
దేవుడికి పూజ చేసే సమయంలో పుష్పాలను సమర్పించి పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇలా పుష్పాలు సమర్పించి పూజ చేయడం అనేది సుగంధ పరిమళాన్ని వెదజల్లే మనసును దైవానికి సమర్పించడం అని అర్థం. ఫలం ( మనస్సు): మనసు ఫలాలు అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించకుండా దేవుడికి అర్పించడం అని అర్థం. త్రిగుణాలతో కూడుకున్న పత్రం దేవుడికి సమర్పించటం. కొబ్బరికాయను దేవుడికి సమర్పించడం వల్ల మనలో ఉన్నటువంటి అహం కొబ్బరికాయ కొట్టిన విధంగా అహంకారం కూడా పటాపంచలు కావాలని దేవుడికి కొబ్బరికాయను సమర్పిస్తూ ఉంటారు.