Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతో అద్భుతంగా పాటిస్తూ ఉంటారు. అలాగే కొన్ని వాస్తు పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు ఇంట్లో సుఖసంతోషాలతో ఉండాలి అంటే తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలని భావిస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఇంట్లోకి కొందరు వస్తే ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు. మరి ఇంటికి ఎలాంటి వారు వస్తే మంచి జరుగుతుందనే విషయానికి వస్తే…
మన ఇంటికి మన ఇంటి ఆడపడుచు వస్తే చాలా శుభం కలుగుతుంది. ఆడపడుచు వచ్చిన సమయంలో తనని సంతోషంగా ఉంచి తాను తిరిగి అత్తవారింటికి వెళ్లే సమయంలో చీర సారే పెట్టి తనని సంతోషంగా పంపించాలి. ఇలా ఎవరైతే ఆడపడుచును పుట్టింటికి సంతోషంగా పంపిస్తారో అలాంటి వారి ఇంట్లో సిరిసంపదలు సుఖసంతోషాలు ఉంటాయి. ఆడపిల్ల పుట్టింటిలో ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు. అందుకే ఆడపడుచును సంతోషంగా ఉంచాలి. అదేవిధంగా ఇంటికి మేనల్లుడు రావడం కూడా శుభసూచకం మేనల్లుడిని చాలా గౌరవంగా చూసుకోవడం ఎంతో మంచిది.
Vastu Tips:
ఇక మన ఇంటికి ఎప్పుడైనా ఋషులు పండితులు మునులు వంటి వారు రావడం కూడా శుభసంకేతం. ఇలాంటివారు ఇంటికి వచ్చినప్పుడు వారిని ఎంతో మర్యాదగా గౌరవించి వారికి ఆతిథ్యం ఇవ్వాలి.వారికి కడుపునిండా భోజనం పెట్టి వారిని సంతోషంగా ఇంటి నుంచి సాగనంపడంతో వారి ఆశీస్సులు మన ఇంటి పై ఉండి ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. భోజనం బాగాలేదు అని చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల వారికి మంచి జరగదు.అందుకే వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించడం వల్ల ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉండవచ్చు.