Vastu Tips:మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో విశ్వసిస్తాము.మనం చేసే పని ఏదైనా విజయవంతంగా పూర్తి కావాలి అంటే తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాస్తు ప్రకారం పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే ఇంట్లో చెప్పులు వదిలే విషయంలో కూడా చాలామంది వాస్తును ఎంతగానో నమ్ముతారు. వాస్తు ప్రకారం మన ఇంట్లో చెప్పులు సరైన దిశలో ఉన్నప్పుడే ఏ ఇబ్బందులు లేకుండా ఎంతో సుఖసంతోషాలతో ఉంటారు.అలా కాకుండా ఇష్టానుసారంగా చెప్పులు వదలడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాస్తు ప్రకారం చెప్పులు ఈ దిశలో ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు ఎప్పుడూ కూడా ఉత్తర తూర్పు దిశలో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దిశ కుబేరుడికి ఎంతో అనుకూలమైన ఇష్టమైన దిశ కుబేరుడు సంపదకు మూలకారకుడు.ఇలా కుబేరుడికి ఇష్టమైనటువంటి ఈ దిక్కున చెప్పులు వదలడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే చెప్పులను ఎప్పుడూ కూడా తూర్పు ఉత్తర దిశలో ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips:
ఇక చెప్పులని ఏ దిశలో ఉంచడం మంచిది అనే విషయానికి వస్తే చెప్పులను ఉత్తర తూర్పు దిశలో కాకుండా పడమర దక్షిణ దిశలలో ఉంచడం మంచిది. వాస్తు ప్రకారం చెప్పులు ఈ దిశలో ఉండటం వల్ల ఇంట్లో అన్నీ కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే చెప్పులను ఎప్పుడూ కూడా ఈ దిశలోనే ఉంచాలి. చాలామంది పనులు ముగించుకొని అలసిపోయి ఇంటికి వస్తుంటారు. అలాంటప్పుడు చెప్పులని ఎక్కడపడితే అక్కడ వదులుతుంటారు. ఇకపై అలా వదలకుండా ఎప్పుడు కూడా పడమర దక్షిణ దిశలలో ఉంచడం ఎంతో మంచిది.