Vastu Tips: సాధారణంగా మనం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని వాస్తు పరిహారాలను కూడా ఎంతగానో పాటిస్తూ ఉంటాము ఏ పని చేసినా కూడా ఆ పనిని వాస్తు అనుగుణంగానే చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవని ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా ఉంటారని భావిస్తారు అంతేకాకుండా వాస్తుకు విరుద్ధంగా మనం ఏదైనా పనులు చేసిన లేదంటే ఇంట్లోకి ఏదైనా అలంకరణ వస్తువులు తెచ్చిన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ క్రమంలోనే మన ఇంట్లోకి పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను తీసుకురాకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు ఇలాంటి వస్తువులు కనుక ఇంట్లో ఉంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట మరి ఇంట్లో పెట్టకూడని వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే… సాధారణంగా మనం ఇంట్లో దేవతల ఫోటోలను పెట్టుకుంటాం అయితే చాలామంది విగ్రహాలను కూడా పెట్టి పూజిస్తుంటారు కానీ ఆరడుగు కన్నా ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలను అసలు పెట్టుకోకూడదట ఇలాంటి విగ్రహాలను పెట్టుకుంటే ప్రతిరోజు అభిషేకాలు నైవేద్యాలు తప్పనిసరి. అందుకే ఎత్తు ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు.
పొరపాటున కూడా లోప భూయిష్టమైన పూజలు చేయకూడదు. అలా పొరపాటున లోపభూయిష్టమైన పూజలు చేస్తే ఆ కుటుంబమే సర్వనాశనం అవుతుంది అదేవిధంగా సాలిగ్రామాన్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతుంటారు. ఈ విధమైనటువంటి సాలిగ్రామం ఇంట్లో కనుక ఉంటే నియమనిష్టలతో పూజ చేయాలి లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఈ విధమైనటువంటి విగ్రహాలను , తెచ్చుకోవటం పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.