Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని భావిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న వస్తువుల కారణంగా మన ఇంటిపై పూర్తిగా నెగిటివ్ ప్రభావం ఏర్పడి ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలను కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచకూడదని పండితులు చెబుతుంటారు మరి ఇంట్లో ఉంచకూడని ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే…
చాలామంది ఇంట్లో అలంకరణ కోసం కాక్టస్ వంటి మొక్కలను పెంచుతూ ఉంటారు. ఇలా ముళ్ళు కలిగినటువంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.తద్వారా ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఇంట్లో ఎక్కువగా పాత న్యూస్ పేపర్లను కూడా పెట్టుకోకూడదు అదేవిధంగా పాడైపోయినటువంటి తాళాలు గడియారాలను కూడా ఇంట్లో లేకుండా చూసుకోవాలి. ఈ వస్తువులన్నీ ఇంట్లో కనుక ఉంటే తప్పకుండా ఆ ఇంటిపై నెగిటివ్ ప్రభావం అనేది పడుతుంది.
Vastu Tips:
ఇకపోతే చాలామంది ఇంటిలో విరిగిపోయిన విగ్రహాలను పగిలిపోయిన దేవుడు చిత్రపటాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి విరిగిపోయిన పగిలిపోయిన చిత్రపటాలను కనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి.ఇలాంటి విగ్రహాలు కనుక ఇంట్లో ఉంటే వెంటనే వాటిని పారుతున్నటువంటి నీటిలో నిమర్జనం చేయడం ఎంతో మంచిది.అందుకే ఇలాంటి వస్తువులను ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదని పెట్టుకుంటే దరిద్ర దేవత మీ చుట్టూ తాండవం చేస్తున్నట్లేనని పండితులు చెబుతున్నారు.