Vastu Tips: ప్రస్థుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ జ్యోతిష్య శాస్త్రం పట్ల ప్రజలకు చాలా నమ్మకం ఉంది. అందువల్ల చాలామంది ప్రజలు ఏ పని అయినా ప్రారంభించడానికి ముందు శాస్త్ర నియమాలు పాటిస్తారు. అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులు అస్సలు దానం చేయకూడదు. ఇలా దానం చేయడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇంట్లో ఉన్న ఏ వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇంటిని శుభ్రం చేయటానికి ఉపయోగించే చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు. అందువల్ల చీపురునూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు దానం చేయకూడదు. పొరపాటున చీపురు ఇతరులకు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురు ఇతరులకు దానం చేయటం అంటే స్వయంగా లక్ష్మీదేవిని ఇతరులకు దానం చేసినట్లు అర్థం . అందువల్ల పొరపాటున కూడా చీపురు ఇతరులకు దానం చేయకూడదు.
• అలాగే మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనె కూడా అస్సలు దానం చేయకూడదు. ఇరుగు పొరుగు వారికి లేదా చుట్టాలకు చేతుల్లో కొబ్బరి నూనె వేస్తూ ఉంటాం. అలా చేస్తే లక్ష్మీదేవి వారితో పాటు మన ఇంటినుండి వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల కొబ్బరినూనె ఎవరికి దానం చేయరాదు.
• అలాగే సాయంత్రము వేళల్లో ఉప్పు కూడా ఎవరికీ దానం చేయరాదు. లక్ష్మీ స్వరూపమైన ఉప్పుని సాయంత్రం ఇంటినుండి బయటకు పంపటం వల్ల లక్ష్మీదేవీ కూడా ఇంటినుండి బయటకు వెళ్తుంది.
•అలాగే కత్తులు, సూదులు, చాకులు వంటి ఇనుప వస్తువులు కూడా ఎవరికి దానం చేయకూడదు.అలాగే ఇంట్లో పాడైపోయిన వస్తువులను కూడా అసలు దానం చేయకూడదు.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.