Wed. Jan 21st, 2026

    Varun Tej, Lavanya Tripathi’s wedding: మెగా ఫ్యామిలీ హీరో..నాగబాబు కొడుకు వ‌రుణ్‌తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా ఇట‌లీలో జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 1న వీరి వివాహం ఎంతో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే కాక్‌టైల్ పార్టీ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జ‌రుగుతున్నాయి. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే వ‌రుణ్‌తేజ్‌, లావణ్య తొలిసారి ప్రేమ‌లో ప‌డ్డారు. అందుకే, ఇట‌లీలోనే వీరు వివాహ వేడ‌కను జరుపుకుంటున్నారు.

    ఇక ఈ వివాహానికి టాలీవుడ్ మాజీ భార్య భ‌ర్త‌లు అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత హాజ‌ర‌వుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. అలాగే, కన్నడ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న కూడా ఇట‌లీ చేరున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఉన్నా, పలువురు సినీ ప్రముఖులు వ‌రుణ్‌తేజ్‌, లావణ్యల పెళ్ళికి హాజరవుతున్నా లేని ఆతృత చైతు – స‌మంత హాజరవడంతో కలిగింది. సోషల్ మీడియా మొత్తం వీరి మీదే ఫోకస్ పెట్టింది.

    varun-tej-lavanya-tripathis-wedding-samantha-and-naga-chaitanyas-wedding-is-hot-topic
    varun-tej-lavanya-tripathis-wedding-samantha-and-naga-chaitanyas-wedding-is-hot-topic

    Varun Tej, Lavanya Tripathi’s wedding: వరుణ్, లావణ్య పెళ్లికి సమంత, చైతూ కలిసి హాజరవడం హాట్ టాపిక్‌

    సమంత-నాగ చైతన్య విడిపోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన తర్వాత సమంతకి అండగా నిలిచింది మెగా ఫ్యామిలీనే. ఆ సమయంలో ఎక్కువగా ఉపాసన సమంతతో ఉంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి సమంత ఒప్పుకుందీ అంటే కొంత రిలీఫ్ గా ఉంటుందని చరణ్, చిరు సలహా ఇచ్చి ఒప్పించారట. ఇక సమంత, నాగ చైతన్య విడాకుల త‌ర్వాత మళ్ళీ ఇంతకాలానికి కలిసి కనిపించడం ఆసక్తికరమైన విషయం.

    varun-tej-lavanya-tripathis-wedding-samantha-and-naga-chaitanyas-wedding-is-hot-topic
    varun-tej-lavanya-tripathis-wedding-samantha-and-naga-chaitanyas-wedding-is-hot-topic

    ఇటీవల సమంత, చైతూ మళ్ళీ కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే, అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ సమంత ముఖ్య పాత్రను పోషించనుందనే టాక్ వినిపిస్తుంది. వాటన్నిటికీ ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లికి సమంత, చైతూ కలిసి హాజరవడం హాట్ టాపిక్‌గా మారింది. విడాకులు రద్దు చేసుకొని మళ్ళీ కలిసి కొత్త జీవితం మొదలుపెడతారా.. అనేది తెలియాలంటే వేచి చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.