Varalakshmi Vratam: శ్రావణమాసంలో మనం ఎన్నో రకాల పూజలు రకాలు చేసుకుంటూ ఉంటాము. ఇక ఈ శ్రావణమాసంలో మంగళ గౌరీ వ్రతంతో పాటు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు ఇక ప్రతి ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది కూడా వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16వ తేదీ జరుపుకోనున్నారు. ఇలా వరలక్ష్మి వ్రతం నిర్వహించి మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.
ఇలా వరలక్ష్మీ వ్రతం చేయటం వల్ల అనుకున్న పనులు జరగడమే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు. ఇలా వరలక్ష్మీ వ్రతం రోజున మాత్రమే కాకుండా ఆరోజు చేయడానికి వీలు కాని వారు ఈ నెలలో ఏ శుక్రవారం అయినా కూడా వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలని అయితే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16 వ తేదీ ఏ సమయంలో జరుపుకోవాలి శుభ తిథి ముహూర్తం ఏంటి అనే విషయానికి వస్తే…
సింహ లగ్న పూజ ముహూర్తం (ఉదయం) – 05:57 am – 08:14 am (వ్యవధి – 2 గంటల 17 నిమిషాలు)
వృశ్చిక రాశి పూజ ముహూర్తం (మధ్యాహ్నం) – 12:50 PM – 03:08 PM (వ్యవధి – 2 గంటల 19 నిమిషాలు)
కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం) – 06:55 PM – 08:22 PM (వ్యవధి – 1 గంట 27 నిమిషాలు)
వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి) – 11:22 pm – 01:18 pm, ఆగస్టు 17 (వ్యవధి – 1 గంట 56 నిమిషాలు) ఇది పూజ చేయడానికి సరైన సమయం.
వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం నిద్ర లేచి తలంటూ స్నానం చేసి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి అనంతరం పూజగదిని ప్రత్యేకంగా అలంకరించుకొని అమ్మవారిని ప్రతిష్టించి పూజ మొదలు పెట్టాలి. అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా అలంకరణ పూర్తయిన తర్వాత అష్టోత్తర మంత్రాలను చదివి అనంతరం కర్పూర హారతులు ఇచ్చి పూజ చేయాలి ఇలా పూజ చేయడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరడమే కాకుండా ఆర్థికంగా ఎదుగుదల కూడా ఉంటుందని విశ్వసిస్తారు.