Varalakshmi Vratam: శ్రావణమాసంలో ఎన్నో రకాల పండుగలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణమాసంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారాన్ని ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు అయితే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీ జరుపుకొనున్నారు. ఇక వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మహిళలు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.
లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి వివిధ రకాల నైవేద్యాలను తయారుచేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈరోజు ముత్తైదువులకు తాంబూలాలను ఇవ్వటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి అనుగ్రహం కోసం మనం పూజ కార్యక్రమాలను చేస్తాము అయితే ఈ చిన్న పరిహారాలను వరలక్ష్మి వ్రతం రోజు కనక పాటిస్తే కాసుల వర్షం కురిసినట్టేనని పండితులు చెబుతున్నారు.
వరలక్ష్మి వ్రతం రోజు మరి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయానికి వస్తే.. పూజ కార్యక్రమం ప్రారంభానికి ముందే అమ్మవారి పాదాల వద్ద 11 పసుపు కొమ్మలను పెట్టికి పూజించాలి అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5 పచ్చ గవ్వలను ఒక ఎర్రని వస్త్రంలో మూటకట్టి మనం డబ్బు నిల్వ చేసే చోట పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాము. ఇక ఈరోజు అమ్మవారికి బియ్యపు పిండి బెల్లంతో తయారు చేసిన పాయసం నైవేద్యంగా పెట్టడం ఎంతో మంచిది.