Vani Jayaram: సినీ నేపధ్య గాయని వాణి జయరాం చెన్నైలో తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అనారోగ్యంతో మరణించింది అని ముందు బయటకి వచ్చింది. తర్వాత ఆమె తలపై బలమైన గాయాలు ఉన్నాయని, వాణి జయరాంకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె పని మనిషి పోలీసులకి ఫిర్యాదు చేసింది. తాను ఎప్పటిలాగే ఇంటికి వెళ్లేసరికి తలుపులు వేసి ఉన్నాయని, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూస్తే ఆమె చనిపోయి ఉందని పనిమనిషి తెలియజేసింది. ఇక ఆమె ఫిర్యాదుతో పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే వాణిజయరాం ఈ ఏడాది పద్మావిభూషణ్ పురస్కారానికి ఎంపికైంది.
అయితే ఆ అవార్డుని అందుకునే లోపే ఆమె ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. ఇక భారతీయ భాషలలో ఏకంగా 20 వేలకి పైగా పాటలని వాణి జయరాం ఆలపించారు. అలాగే ఎన్నో భక్తిగీతాలు కూడా పాడారు. అయితే చాలా కాలంగా ఆమెని పాటలకి దూరంగా ఉన్నారు. ఒంటరిగా చెన్నైలో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె మృతి మిస్టరీగా మారింది. ఇక తాజాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాణి జయరాం తలపై బలమైన గాయం ఉందని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో నివేదిక రావడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
ఇక ఆ నివేదిక ఆధారంగా కేసుని హత్య లేదంటే సహజసిద్ధమైన మరణమా అనేది నిర్ధారిస్తారు. మరో వైపు ఆమె ఆస్తిపాస్తులు, అదే సమయంలో ఈ మధ్యకాలంలో ఆమెని ఎవరైనా కలుసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పద్మవిభూషణ్ రావడంతో ఆమెకి అభినందనలు తెలపడానికి తరుచుగా ఎవరో ఒకరు ఆమె ఇంటికి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమెది హత్య అని పనిమనిషి అనుమానిస్తున్న ఎవరికి ఆమెని చంపే అంత పగ ఉంటుంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక లెజెండ్రీ గాయని ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.