Janasena Party: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న జనసేన పార్టీ ఆ దిశగా ముందడుగు వేస్తుంది. తన ఎన్నికల వ్యూహాలలో భాగంగా అధికార, ప్రతిపక్షాలకి అర్ధంకాని రీతిలో నిశ్శబ్దంగానే జనసేనాని తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు పార్టీలు పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాయనే మాట వినిపిస్తుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఎన్నికల కార్యాచరణపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడమే అని చెప్పాలి. ఇక జనసేన ఆవిర్భావ సభ మార్చి 14న జరగబోతుంది. ఈ సభ తర్వాత ఏపీ రాజకీయాలలో, జనసేన కార్యాచరణలో కచ్చితమైన మార్పు కనిపిస్తుందని అందరూ భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు చాలా మంది అధికార, ప్రతిపక్షాలకి చెందిన నాయకులు ఎదురుచూస్తున్నారు. అయితే జనసేనాని మాత్రం తన వైఖరిని స్పష్టంగా వారికీ తెలియజేసిన తర్వాత, వారు ఒప్పుకుంటేనే పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వంగవీటి రాదా జనసేనలో చేరుతారనే ప్రచారం మరల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాదా మార్చి 14న ఆవిర్భావ సభ రోజున పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని టాక్ వినిపిస్తుంది.
ఇక ఆ రోజు కాదంటే మార్చి 22న కచ్చితంగా చేరుతారని సమాచారం. ఇప్పటికే దీనిపై స్పష్టమైన క్లారిటీ కూడా వచ్చిందని టాక్. పవన్ కళ్యాణ్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు, అలాగే కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం అనే అజెండాతో వంగవీటి రాదా జనసేనతో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రాదా ఎమ్మెల్యేగా బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. కాపు సామాజికవర్గ బలంతో పాటు, కుటుంబ బలం కూడా ఆ నియోజకవర్గంలో తనని గెలిపిస్తుందని రాదా భావిస్తున్నట్లు టాక్.