Amavasya: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతినెల పౌర్ణమి అమావాస్యలను మనం జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ పౌర్ణమి అమావాస్యలకు చాలా ప్రత్యేకత ఉంది కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున పండుగలాగా జరుపుకుంటారు. అంతేకాకుండా అమావాస్య పౌర్ణమి రోజు పూజలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. మనలో ఏవైనా దోషాలు ఉన్నా కూడా పరిహారం చేసుకోవడానికి పౌర్ణమి అమావాస్యలు అనుకూలమైనవిగా భావిస్తారు.
మే 7వ తేదీ వైశాఖ అమావాస్య అయితే ఈరోజు కనుక ఈ చిన్న పరిహారం చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయి అలాగే దోషాలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. వైశాఖ అమావాస్య ఇది మే 7వ తేదీ ఉదయం 11:41 గంటలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు మే 8 వ తేదీ ఉదయం 8:51 గంటలకు ముగుస్తుంది. పురాణాల ప్రకారం, వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉంది.
ఈరోజు శ్రీ హరి ఆరాధన వలన మోక్షం కలిగి నర దిష్టి, నర ఘోష పూర్తిగా తొలగిపోతుంది. విష్ణువు, పితృదేవతలు చెట్టుపై నివసిస్తారని చెబుతుంటారు. అందుకే వైశాఖ అమావాస్య రోజు రావి చెట్టుకు నీరు పోయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు పితృదేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు.ఇక మన జాతకంలో పితృ దోషం కనుక ఉంటే పితృ దోషం కూడా తొలగించుకోవడానికి వైశాఖ అమావాస్య ఎంతో శుభంగా పరిగణిస్తారు. పితృ దోషాలతో బాధపడేవారు అమావాస్య రోజున పితృ చాలీసా చదవటం వల్ల కూడా దోషాలు తొలగిపోయి మనం చేయాలనుకున్న పనులలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి.