Categories: LatestNews

Uttarakhand : ఏడాదిలో రాఖీ పండుగ ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు..ఎందుకంటే?

Uttarakhand : హిందువులు చేసుకునే ప్రతి పండుగకు ఒక పురాణ కథ ఉంటుంది. ప్రతి సంవత్సరం సోదరీ, సోదరులు జరుపుకునే రాఖీ పండుగకు కూడా ఎన్నో కథలు పురాణాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపించే కథ బలిచక్రవర్తికి శ్రీ మహాలక్ష్మి రాఖీ కట్టడం. బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేయాలని శ్రీ మహా విష్ణువు వామనుని అవతారం ఎత్తాడు. ఆ తర్వాత బలిచక్రవర్తిని తన ద్వారపాలకుడిగా చేస్తానని శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేస్తాడు. అయితే ఇంతలో తన భర్త అయిన మహా విష్ణువుని తిరిగి వైకుంఠానికి తీసుకురావాలని శ్రీ మహాలక్ష్మీ కోరుకుంటుంది. అప్పుడు నారద ముని.. కలుగచేసుకుని బలికి రక్షా బంధన్ కట్టమని లక్ష్మీదేవికి సలహా ఇచ్చాడు . ఆలా వామన అవతారం పూర్తి చేసుకుని శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవితో కలిసి వైకుంఠానికి పయనమయ్యాడు. అలా వామన అవతారం చాలించి శ్రీ మహావిష్ణువుగా మారిన తర్వాత తన తొలి అడుగుపెట్టిన ప్రదేశమే ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా ఉర్గామ్ లోయ.

uttarakhand-the-temple-opens-only-on-raksha-bandhan-festival

శ్రీ మహావిష్ణువు అలకనందానది ఒడ్డున బన్షీ నారాయణుడిగా కొలువుదీరాడు . ఈ ఆలయం .. 13 వేల అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ధామ్‌కు అతి దగ్గరగా ఉంది. ఆలయంలో శివుడు, గణేశుడు, వాన్ దేవి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయం కేవలం రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆరోజు మాత్రమే ఆలయం ప్రాంగణం భక్తులతో సందడిగా మారుతుంది. రాఖి పర్వదినం రోజున తలుపులు తెరిచి స్వామివారికి పూజలు చేసిన అనంతరం మహిళలు , బాలికలు రాఖీలకు పూజలు చేసి స్వామివారి సన్నిధిలో తమ సోదరులకు రాఖీలు కడతారు. అంతే కాదు రాఖీ పండుగ వేళ భక్తులు ఆలయంలో ప్రసాదం చేస్తారు. ఈ ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రసాదం తయారీ కోసం అవసరమయ్యే వెన్నను ప్రతి ఇంటి దగ్గర నుంచి సేకరించి మరీ భక్తులు ఆలయానికి తీసుకొస్తారు. .. దాంతో ప్రసాదం తయారు చేసి విష్ణువుకు సమర్పిస్తారు.

uttarakhand-the-temple-opens-only-on-raksha-bandhan-festival

ఈ వైష్ణవాలయం ఉర్గాం గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి భక్తులు చేరుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణం చేసేవారు.. హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలినడకన వంశీ నారాయణ దేవాలయానికి చేరుకోవాలి. అయితే రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయాన్ని మీరు సందర్శించాలనుకుంటే ఆలస్యం చేయకుండా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.

Sri Aruna Sri

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.