Tollywood : మన దర్శకులు, రచయితలు పొరుగు రాష్ట్రాలలోని సినిమా కథలను, వాటిలోని సన్నివేశాలను కాపీ కొడుతుండటం ఎన్నో ఏళ్ళ నుంచీ వస్తున్నదే..అందరూ చూస్తున్నదే. అగ్ర దర్శకులుగా చలామణి అవుతున్న త్రివిక్రమ్మ్ శ్రీనివాస్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంటి వారు కూడా పాత సినిమాల నుంచి సీన్స్ ని కాపీ కొడుతున్నారు. ఇద్దరి మీద ఈ ముద్ర ఎప్పటి నుంచో ఉంది. అల వైకుంఠపురం కథను అప్పటి ఇంటిగుట్టు సినిమా నుంచి తీసుకున్నదే అని కామెంట్స్ వినిపించాయి.
రాజమౌళి కూడా ఆయన తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలలోనూ కొన్ని హాలీవుడ్ సినిమాలలోని సీన్స్, కొన్ని పాత తెలుగు సినిమాలలోని సీన్స్ తీసుకున్నారని చెప్పుకున్నారు. అయితే, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ప్రధాన పాత్రలో నటించగా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించిన వకీల్ సాబ్ సినిమాలోని ఓ సీన్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన సినిమా నుంచే తీసుకున్నట్టు ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ అని లేడీ పోలీస్ ఆఫీసర్ ను కామెంట్స్ చేసే సీన్ గతంలో రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ హీరోలుగా నటించిన బావా మరదళ్ళ సవాల్ సినిమాలో ఉన్నదే అని ఆ వార్త సారాంశం. ఈ రెండు సినిమాలలోని సీన్స్ చూస్తే కాస్త కాపీ కొట్టినట్టే అనిపిస్తోంది. వేణు శ్రీరాం దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ సీన్ బాగా హైలెట్ అయింది.
అయితే, గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి ఆడే సీన్ లో పవన్ కళ్యాణ్ హీరో రాజశేఖర్ యాటిట్యూడ్ ని పేరడి చేస్తారు. అది సినిమాకి ఎంత హైలెట్ అయిందో..అన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే, పవన్ కళ్యాణ్ తన వకీల్ సాబ్ సినిమాలో రాజశేఖర్ సినిమాలోని సీన్ కాపీ చేయడం మీద కూడా ఇప్పుడు ఇలాంటి కామెంట్సే వినిపిస్తున్నాయి. సినిమా రిలీజై కూడా చాలా నెలలు అయింది కాబట్టి ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఇప్పుడు లైట్ అంటున్నారు పీకే ఫ్యాన్స్.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.