Hebah Patel : టాలీవుడ్ కుర్రభామ హెబ్బా పటేల్ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుందనే తాజా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీ ఓ టాలీవుడ్ యంగ్ హీరోనే పెళ్ళి చేసుకోబోతుందని ఇక్కడా అక్కడా చెవులు కొరుక్కుంటున్నారు. హెబ్బా పటేల్ తెలుగులో అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన కుమారీ 21 ఎఫ్ మూవీలో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది.
ఆ తర్వాత చేసిన సినిమాలలో కొన్ని యావరేజ్‌గా, కొన్ని డిజాస్టర్‌గా నిలిచాయి. ఇప్పటికీ హెబ్బా కాస్తో కూస్తో టాలీవుడ్‌లో క్రేజ్ ఉంది. అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. కానీ, స్టార్ హీరోయిన్‌గా నిలబడేంత భారీ చిత్రం మాత్రం హెబ్బాకి రావడం లేదు. అయితే, ఇప్పుడు హెబ్బా పటేల్ గురించి ఓ టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతుందని. అఫీషియల్‌గా ఇది నిజమని ఎక్కడా కనిపించలేదు.
సోషల్ మీడియాలో అందరూ హెబ్బాకి కాబోయో వరుడెవరో అని సర్చ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ త్రిపాఠిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే యంగేజ్‌మెంట్ కూడా జరిగింది. ఇదే వరుసలో టాలీవుడ్ బ్యూటీ హెబ్బా కూడా పెళ్ళి చేసుకోబోతుందని అంటున్నారు.
అయితే, ఇక్కడ కాస్త షాకింగ్ విషయం ఏమిటంటే హెబ్బా పెళ్ళి చేసుకోబోయేది యంగ్ హీరో రాజ్ తరుణ్ అట. అవును, ప్రస్తుతం ఇదే మాట వినిపిస్తోంది. కుమారీ 21 ఎఫ్ సినిమాలో జంటగా నటించిన ఈ యంగ్ కపుల్ ఇప్పుడు నిజ జీవితంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటవబోతున్నారట. మరి ఇప్పటికైతే అధికారికంగా అటు రాజ్ తరుణ్ గానీ, ఇటు హెబ్బా పటేల్ గానీ వెల్లడించలేదు. చాలామంది సినీ తారలు తమ పెళ్లి విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. చూడాలి హెబ్బా పెళ్ళి వార్తల్లో నిజమెంత ఉందో.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.