Using Laptop: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో కూర్చొని లాప్టాప్ లో గంటల తరబడి వర్క్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది లాప్టాప్ ఉపయోగించే సమయంలో తమ ఒడిలో లాప్టాప్ పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకోవడం వల్ల ప్రమాదంలోకి పడతారని నిపుణులు చెబుతున్నారు. మరి ఒడిలో లాప్టాప్ పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయనే విషయానికి వస్తే…
ఒడిలో ఎక్కువగా లాప్టాప్ పెట్టుకొని పని చేయడం వల్ల వారి తొడల భాగంలో చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.ఇక లాప్టాప్ లో పనిచేయడం వల్ల ఎక్కువగా రేడియేషన్ కూడా ఉంటుంది కనుక ఇలా తరచూ ఒడిలో లాప్టాప్ పెట్టుకొని పని చేసే వారికి కొన్నిసార్లు చర్మ కాన్సర్ కి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అందుకే వీలైనంతవరకు ఈ విధంగా ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకొని పని చేయడం మానేయాలని…. మనం ఆఫీసులో ఏ విధంగా అయితే విధులు నిర్వహిస్తామో అలా ఇంట్లో కూడా పనిచేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి నుంచి విధులు నిర్వర్తించడం అంటే మనకు ఇష్టం వచ్చిన విధంగా పనిచేస్తుంటాము మంచంపై కూర్చొని చేయడం ఎక్కువగా లాప్టాప్ ఒడిలో పెట్టుకొని పనిచేయడం వంటివి చేస్తుంటారు. తద్వారా ఇతర అనారోగ్య సమస్యలు కూడా మనల్ని వెంటాడుతాయి. ఈ విధంగా ఇంట్లో కూర్చొని ఇష్టానుసారంగా పనిచేసే వారిలో అధిక శరీర బరువు పెరిగిపోతారు. అలాగే నడుము చుట్టు కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి కూడా దారి తీస్తుంది అందుకే మనం ఆఫీసులో ఏ విధంగా అయితే వర్క్ చేస్తామో ఇంట్లో కూడా అలాగే విధులు నిర్వర్తించడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.