Upasana Konidela : మెగా పవర్‌స్టార్ రామచ్ చరణ్ , ఉపాసనల గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాలీవుడ్ లో వీరు స్వీట్ కపుల్స్. మెగాస్టార్ చిరంజీవి కుమారుడైనా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో రాణిస్తున్న చరణ్, ఉపాసనను ప్రేమించి మరీ పెద్దలను ఒప్పింది పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ..వారి ప్రొఫెషన్ లో తోడుంటూ తమ లైఫ్ ను ఎంతో సరదాగా గడుపుతారు. చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ కొంత టైమ్ కచ్చితంగా తన ఫ్యామిలీకి కేటాయిస్తాడు. ఉపాసనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అప్పుడప్పుడు ఈ జంటకు సంబంధించిన వెరీ స్వీట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
మొన్నామధ్య అంబానీల ఫంక్షన్ కు విమానంలో వెళుతూ భార్య కాళ్లు నొక్కిన రామ్ చరణ్ వీడియో నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిని బట్టి చూస్తూ వీరి ప్రేమ ఎలాంటిదో వారి బంధం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఉపాసన కూడా చరణ్ ప్రతి సక్సెస్ లో వెనకాలే ఉంటుంది. పెళ్లైన 10 ఏళ్లకు ఈ జంటకు ఈ మధ్యనే ఓపా ప పుట్టింది. మెగా ప్రిన్సెస్ క్లింకార రాకతో మెగా ఫ్యామిలీలోని ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఇదిలా ఉంటే తాజాగా చరణ్, ఉపాసనలకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ మదర్ ఉపాసన కొణిదెల ఓ ఇంటర్వ్యూలో డెలివరీ తర్వాత తన ఎమోషనల్ జర్నీని పంచుకుంది. తన భర్త చరణ్ సపోర్ట్ తోనే డిప్రెషన్ నుంచి బయటికి వచ్చానని తెలిపింది. నా ప్రతి కష్టంలో నా భర్త నాకు పిల్లర్ గా నిలబడ్డాడని భావోద్వేగమైంది. డెలివరీ తర్వాత డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు రామ్ నాతో పాటే నా పుట్టింటికి వచ్చాడని తెలిపింది. భర్తను పొగడ్తలతో ముంచేసింది.
“నా భర్త చరణ్ నా థెరపిస్ట్. మిగతా మహిళల్లాగే నేను డెలవరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నాకు చరణ్ అండగా నిలిచాడు. నాతో పాటే చరణ్ మా మా పుట్టింటికి వచ్చేశాడు. నిజంగా ఇలాంటి భర్త ఎవరికీ ఉండరేమో. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. భార్య అమ్మగా మారే సమయంలో భర్త మద్దతు చాలా అవసరం. చరణ్ నన్ను చూసుకున్న తీరు నిజంగా మరిచిపోలేనిది. ఆయన నా గురించి ఆలోచించే విధానం నాకు బాగా నచ్చుతుంది. చరణ్ నా భర్త కావడం నిజంగా నా అదృష్టం”అని ఉపాసన ఎమోషనల్ అయ్యింది.