Wed. Jan 21st, 2026

    Unstoppable 2: యానిమల్‌తో బాలయ్య హిందీ..ఏ రేంజ్‌లో ఇరగదీస్తాడో..? అవును త్వరలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షోకి యానిమల్ హీరో రణబీర్ కపూర్ వచ్చి సందడి చేయబోతున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 1 భారీ స్థాయిలో సక్సెస్ సాధించింది. ఆ తర్వాత సీజన్ 2 అంతకి మించి అన్నట్టుగా సాగింది. అయితే, ఇప్పుడు ఈ ఎంటర్‌టైమెంట్ షోకి బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాబోతున్నారు.

    అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా రూపొందించిన హిందీ చిత్రం యానిమల్. ఈ సినిమాపై అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసి భారీ సక్సెస్ అందుకోవాలని సందీప్ తో పాటుగా హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నలు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

    unstoppable-2-Unstoppable 2: Balayya Hindi with Animal..in which range..?
    unstoppable-2-Unstoppable 2: Balayya Hindi with Animal..in which range..?

    Unstoppable 2: బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్

    ఈ నేపథ్యంలోనే యానిమల్ మూవీ ప్రమోషన్స్‌ని హైదరాబాద్‌లో కూడా నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రణబీర్ కపూర్ వచ్చి సందడి చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ ఒకటి నెట్టింట బాగా సందడి చేస్తూ వైరల్ అవుతోంది. మరి రణబీర్ కపూర్ ఒక్కడే ఈ షోకి వస్తున్నారా లేక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ రష్మిక మందన్న కూడా వస్తున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది.

    ఇక బాలయ్య హిందీ భాషపై గట్టి పట్టున్న సంగతి తెలిసిందే. ఈవెంట్స్‌లో టిపికల్ వర్డ్స్ కూడా వాడి వైరల్ అవుతుంటారు. మరి యానిమల్ ప్రమోషన్స్ లో రణబీర్ కపూర్ తో బాలయ్య మాట్లాడే హిందీ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. కాగా, యానిమల్ తర్వాత ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.