Wed. Jan 21st, 2026

    PCOD: సాధారణంగా ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే సమస్యలల్లో పీరియడ్స్ సమస్య ఒకటి కొంతమందికి పీరియడ్స్ పెద్దగా సమస్య అనిపించదు కానీ చాలామంది మాత్రం ప్రస్తుత కాలంలో పీరియడ్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమయంలో మూడు స్వింగ్ అవడం తీవ్రమైనటువంటి నడుము నొప్పి కడుపునొప్పి వామిటింగ్స్ కావడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా ఈ మూడు రోజుల పాటు ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

    ఈ విధంగా పీరియడ్స్ సమయంలో ఇలాంటి నొప్పి కనుక ఉంది అన్నట్టయితే వారిలో ఏదైనా సమస్య ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అలాంటివారు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మందిలో పీరియడ్స్ ఇటీవల కాలంలో క్రమంగా రావడం లేదు హార్మోన్స్ అసమతుల్యత కారణంగా క్రమ రహిత పీరియడ్స్ వస్తున్నాయి అయితే చాలామందికి పీసీఓడీ పీసీఓఎస్ వంటి కారణాలవల్ల ఈ విధమైనటువంటి సమస్య వస్తుంది. చాలామందికి పిసిఒడి లేకపోయినా కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అలాంటి వారు అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడుతూ ఉంటారు.

    అల్సరేటివ్ కొలిటిస్ అనేది ఒక రకమైన దీర్ఘకాలిక ప్రేగు వ్యాధి. ఇది జీర్ణాశయంలో మంట, అల్సర్లకు కారణమవుతుంది. పెద్దప్రేగు, పురీషనాళం వాపు వల్ల అసాధారణ కడుపు నొప్పి, పేగు పూత, అతిసారం, మల రక్తస్రావం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఈ సమస్యతో బాధపడే వారిలో కూడా హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్స్ అనేవి సక్రమంగా రావని తెలుస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి సరైన సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.