Tulasi Plant: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో తులసి మొక్క తప్పకుండా మనకు దర్శనమిస్తుంది.హిందువులు తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో ప్రత్యేకంగా తులసి మొక్కకు ఒక కోటను ఏర్పాటు చేసి పూజిస్తూ ఉంటారు. ఇలా ఉదయం సాయంత్రం తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఏ ఇంటి ఆవరణంలో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో సకల సంపదలు వెల్లువేరుస్తాయని భావిస్తారు. అయితే మన ఇంటి ఆవరణంలో ఏ విధమైనటువంటి తులసి మొక్క మంచిది ఎలాంటి మొక్కను పెంచాలి అనే విషయానికి వస్తే…
సాధారణంగా తులసిలో రెండు రకాల తులసి మొక్కలు ఉంటాయి ఒకటి రామ తులసి మరొకటి కృష్ణ తులసి.ఇంటి ఆవరణంలో మనం పెంచడానికి రామ తులసి ఎంతో పవిత్రమైనదిగా శుభప్రదమైనదిగా భావిస్తారు.రామ తులసి ఎలా ఉంటుంది ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే రామ తులసి ఎప్పుడు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇలా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి తులసి మొక్క కనుక మన ఇంటి ఆవరణంలో ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Tulasi Plant
ఇక కృష్ణ తులసి విషయానికి వస్తే కృష్ణ తులసి ఎక్కువగా అడవులలో పెరుగుతుంది.అయితే చూడటానికి రామ తులసి కృష్ణ తులసి ఒకేలా ఉంటాయి కృష్ణ తులసి కాస్త ముదురు రంగులో ఉంటుంది. ఈ రెండు తులసి మొక్కలు ఎంతో పవిత్రమైనవి అయినప్పటికీ ఇంటి ఆవరణంలో మాత్రం రామ తులసి ఉండడం ఎంతో మంచిది. ఇలా రామ తులసి ఉన్న ఇంటి ఆవరణంలో సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై ఉంటుందని చెప్పాలి. ఇక తులసి మొక్క ఉన్న ప్రదేశంలో ఏ విధమైనటువంటి చెత్తాచెదారం లేకుండా ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉండాలి.