Tulasi Leaves: తులసి మన ఇంటి ఆవరణంలో కనిపించే మొక్క.తులసి మొక్కను హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్కను నాటి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఆధ్యాత్మిక పరంగా తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే తులసి మొక్కకు ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పాలి. తులసి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉండడంతో ఆయుర్వేదంలో తులసికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.
ఇకపోతే తులసి ఆకులలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాటి ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయనే సంగతి మనకు తెలిసిందే.మరి తులసి ఆకును ప్రతిరోజు ఉదయం పరగడుపున రెండు ఆకులు నమిలి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్నికి వస్తే..తులసి ఆకులను ప్రతిరోజు పరగడుపున రెండు తినటం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోయి నోరు చాలా తాజాగా ఉంటుంది. అదేవిధంగా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.
మన ప్రేగులలో పేరుకుపోయినటువంటి మలినాలను బయటకు పంపించడంలో తులసి ఆకులు ఎంతో దోహదపడతాయి. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అంటూ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఈ ఆకులను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతిరోజూ తులసి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయని,అలాగే ఆస్తమా శ్వాస కోస సంబంధిత వ్యాధుల నుంచి కూడా బయటపడటానికి తులసి ఆకులు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పాలి.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.