Wed. Jan 21st, 2026

    Tuesday Remedies: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆరోజు ఆ దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటాము.అయితే మంగళవారం మన సాంప్రదాయాల ప్రకారం ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము.ధైర్యానికి బలానికి ప్రత్యేకగా అయినటువంటి బజరంగబలిని మంగళవారం పూజించడం వల్ల మనం ఎన్నో శుభాలను పొందవచ్చు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మంగళవారం ఈ మూడు సమర్పించి పూజ చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.

    మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి ఆకులను అలాగే తమలపాకుల మాలలను సమర్పించి పూజ చేయడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారు. దీంతో ఆయన అనుగ్రహం మనపై ఉండే గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు కూడా నెరవేరుతాయి.అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎంతో ప్రీతికరం అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మంగళవారం స్వామివారికి మల్లెనూనె అలాగే సింధూరం సమర్పించడం ఎంతో మంచిది.

    Tuesday Remedies

    ఇలా స్వామివారికి సింధూరం సమర్పించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బూందీ లడ్డును మంగళవారం నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామి వారు ప్రీతికరం చెందుతారు. స్వామివారికి బూందీ లడ్డు అంటే ఎంతో ఇష్టం ఇలా మంగళవారం ఈ బూందీ లడ్డును సమర్పించి అనంతరం ప్రసాదంగా ఇతరులకు పంచడం వల్ల స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా మనపైనే ఉంటాయి.