Wed. Jan 21st, 2026

    SSC Exams: తెలంగాణలోని 10వ తరగతి విద్యార్ధులకి నిర్వహించే ఎస్.ఎస్.సి పరీక్షలకి సంబందించిన హాల్ టికెట్లని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ తెలియజేసింది. ఒకప్పుడు హాల్ టికెట్లు కోసం స్కూల్ కి వెళ్లి తీసుకునే వారు. అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేరుగా వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక దానికి సంబందించిన వివరాలని కూడా తెలియజేసింది.

    Telangana to release SSC hall tickets from March 24 @ bse.telangana.gov.in.

    ఇక మార్చి 24 నుంచి https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో విద్యార్ధులు తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్, ఓఎస్.ఎస్.సి హాల్ టికెట్లు అన్ని కూడా ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ఎస్.ఎస్.సి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరగనున్నాయి.

    AP SSC hall tickets out for April 2023 exams at bse.ap.gov.in

    ఇక ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే విధానం లోకి వెళ్తే ముందుగా వెబ్ సైట్ మీద క్లిక్ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లెఫ్ట్ సైడ్ టాప్ లోనే ఎస్.ఎస్.సి పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు అని ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఏ పరీక్షలకి సంబంధించి హాల్ టికెట్ కావాలనేది అక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఎంపిక చేసుకొని క్లిక్ చేయాలి. మరో పేజీలో హాల్ జిల్లా, స్కూల్, పేరు, పుట్టిన తేదీ డిటైల్స్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. దానిని ప్రింట్ అవుట్ తీసుకౌంటే సరిపోతుంది.