TS Elections 2023 : తెలంగాణలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వినిమధ్యంలో ఎలక్షన్ కమిషనర్ కూడా ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎక్కడా అవాంఛనియా సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా తమ నాయకులను ఎన్నుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ టాప్ స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లోని పోలింగ్ బూత్ నంబర్ 149 లో చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఇద్దరూ రేపు ఓటు వేయనున్నారు. వీరితోపాటు యంగ్ హీరో నితిన్, రామ్ చరణ్ కపుల్స్ కూడా పోలింగ్ బూత్ నంబర్ 149 లో ఓటు వేయనున్నట్లు సంసచారం. బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పోలింగ్ బూత్ నంబర్ 153 లో ఓటు హక్కు వినియోగించనున్నారు. అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డి తో పాటు అల్లు అరవింద్,అల్లు శిరీష్ లు కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు జూబ్లీహిల్స్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లోని 165 పోలింగ్ బూత్ లో ఓటు వేస్తారు. ఆయన భార్య నమ్రత తో కలిసి ఇక్కడే ఓటు వేయనున్నారు.యాంగ్రీ ఎంగ్ మెన్ మోహన్ బాబు మంచు లక్ష్మి, మంచు మనోజ్ , మంచు విష్ణు కూడా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లోనే ఓటు వేయనున్నట్లు సమాచారం. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ 164 లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ , ఆనంద్ దేవరకొండ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఓబుల్ రెడ్డి స్కూల్ దగ్గర ఉన్న పోలింగ్ బూత్ 150 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓటు వేయనున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు.వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లోని పోలింగ్ బూత్ నంబర్ 151 లో అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ ఓటు వేయబోతున్నారు. మణికొండ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఓటు వేయనున్నారు. అక్కడే స్వీటీ అనుష్క, కామెడీ స్టార్ బ్రహ్మానందం, విక్టరీ వెంకటేష్ కూడా ఓటు వేయనున్నారు. వీరితో పాటూ పలువురు సెలబ్రిటీలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లలో ఓటు వేయనున్నారు.