Hair care: సాధారణంగానే చుండ్రు సమస్యతో బాధపడే వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువగానే ఉంటోంది. దానికి తోడు వేసవి సీజన్ ప్రారంభం అవడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలో చెమట ఎక్కువగా పట్టడం జరుగుతుంది దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై చుండు సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. కావున చుండ్రు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే కొన్ని ఆయుర్వేద పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలను తెలుసుకునే ముందు మీరు ప్రతిరోజు ఒక నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.
వేడి నీటితో స్నానం చేస్తుంటే వెంటనే మానుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. వేడి నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య మరింత అధికమవుతుంది. వేప నూనె, కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని సమపాలల్లో తీసుకొని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మీకు వీలైతే వేప ఆకులను మెత్తని గుజ్జులా మార్చుకొని తలకు మర్దన చేసుకుంటే వేపాకులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తొలగించడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.యాంటీ బ్యాక్టీరియల్ , ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న మెంతులను రాత్రంతా నానబెట్టి మరసటి రోజు మెత్తటి మిశ్రమంగా మార్చి ఈ మిశ్రమాన్ని తల కుదుళ్లకు అంటే విధంగా మర్దన చేసుకుంటే చుండ్రు సమస్య తొలగి వెంట్రుకలు దృఢంగా కాంతివంతంగా తయారవుతాయి. ఇలాంటి చిట్కాలు పాటించడంతో చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.