Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ హీరోగా పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాని ఆగష్టు 10న రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న సినిమాకి రెడీ అవుతారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ స్టార్ హీరోలనే లైన్ లో పెట్టారు. ఇక తనని తాను పాన్ ఇండియా దర్శకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు.
దీని తర్వాత జూనియర్ ఎన్టీఅర్ తో ఒక పౌరాణికం చేసే చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగా అల్లు అర్జున్ తో మళ్ళీ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా స్టొరీ ఇప్పటికే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ నేరేట్ చేసాడని టాక్. ఈ నేపధ్యంలో వేసవిలో మూవీని అఫీషియల్ గా లాంచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలతో హ్యాట్రిక్ వచ్చాయి. మళ్ళీ అల్లు అర్జున్ డేట్స్ వెంటనే దొరకడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ అతనితోనే సినిమాని కమిట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సారి బన్నీ కోసం ఫ్యామిలీ కథని కాకుండా కంప్లీట్ గా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో జులాయి తరహాలో మూవీని తెరకెక్కించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాలంటే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.