Chiranjeevi – Srimukhi : చిరు, శ్రీముఖిల మధ్య నడుము సీన్ ఉండబోతుందని..భోళా శంకర్ సినిమాకి అది హైలెట్‌గా నిలుస్తుదని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ నడుము సీన్ అంటే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది ఖుషి సినిమాలోని పవన్ కళ్యాణ్, భూమిక కాంబోలో చిత్రీకరించినదే. ఇంట్రవెల్ ముందు వచ్చే ఈ సీన్ సినిమాకి చాలా హైలెట్. ఖుషి ఎన్ని భాషలలో వచ్చినా కూడా తెలుగులో సన్నివేశం గురించే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.
నితిన్ కూడా ఈ సీన్ అనుసరించి గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో పెట్టాడు. కానీ, ఆ సీన్ గురించి ఎవరూ మాట్లాడుకోరు. అయితే, ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని మెగాస్టార్ చిరంజీవి, బుల్లితెర పాపులర్ యాంకర్ కం నటి శ్రీముఖిల మధ్య చిత్రీకరించబోతున్నారట. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా ప్రధాన పాత్రల్లో భోళా శంకర్ తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా కనిపించబోతోంది.
ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ పూర్తైంది. చిరు, శ్రీముఖిలపై ఆల్రెడీ కొన్ని సన్నివేశాలను కంప్లీట్ చేశారు. అయితే, వాటిలో కొన్ని మళ్ళీ రీషూట్ చేస్తున్నారట. దీనిలో భాగంగా చిరంజీవి శ్రీముఖి నడుము చూసే సీన్ తెరకెక్కించినట్టు సమాచారం. ఈ సీన్‌లో ఇద్దరు పోటీపడి నటించారని చెప్పుకుంటున్నారు. కానీ, కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఇలాంటి సీన్స్ మెగాస్టార్ చేయడం అంత బాగోదని అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారట. ఆయన స్టామినాకి మరీ ఇంత సిల్లీ సీన్స్ చేయడం కరెక్ట్ కాదని చర్చించుకుంటున్నారట. మరి అన్నయ్య ఇలాంటి సీన్స్‌లో నటించి థియేటర్స్‌లో ఈలలేయిస్తారు. చూడాలి భోళా శంకర్ మూవీలో చిరు, శ్రీముఖిల సీన్స్ ఎలా అలరిస్తారో.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
This website uses cookies.