Tooth Pain: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇబ్బంది పెట్టే సమస్యలలో దంతాల సమస్య ఒకటి.ఇలా దంతాలు పుచ్చిపోయి ఉండటం వల్ల తీవ్రమైన నొప్పి బాధను కలిగిస్తూ ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లలు అధికంగా చాక్లెట్స్ చక్కర అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం బ్రష్ సరిగా చేయకపోవడం వల్ల ఈ దంత సమస్యలు తలెత్తుతుంటాయి కొందరిలో పళ్ళు పుచ్చిపోయి తరచూ తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా పుచ్చిపోయిన దంతాలు ఉన్నటువంటి వారు తరచూ నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నొప్పి మాత్రం తగ్గదు ఇలా పుచ్చిన దంతాలతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాల ద్వారా నొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
పుచ్చిన దంతాల నొప్పి సమస్య నుంచి బయటపడటానికి మనకు మార్కెట్లో దొరికే స్పటికం తీసుకొని ఒక పది నిమిషాల పాటు ఆ స్పటికాన్ని నీటిలో కరిగించాలి. ఇలా పది నిమిషాల పాటు కరిగిన తర్వాత ఈ నీటిని నోటిలో పోసుకొని బాగా పుక్కలించాలి. ఇలా నాలుగు ఐదు సార్లు పుక్కిలించడం వల్ల దంతనొప్పి సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. ఇలా ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల తిరిగి దంతనొప్పి సమస్యతో బాధపడే అవకాశాలు కూడా ఉండవు.
Tooth Pain
అదేవిధంగా మన వంటింట్లో లభించే లవంగం పొడిచేసి నొప్పి వచ్చిన పంటి పై కాసేపు పెట్టడం వల్ల పూర్తిగా సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక మనకు ఎక్కడైతే నొప్పి కలుగుతుందో బయట చర్మం పై ఆ ప్రాంతంలో ఐస్ క్యూబ్ తో మర్దన చేయడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. బాగా మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల దంత నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా ఈ సింపుల్ చిట్కాలను ఉపయోగించి నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.