Tooth Decay: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా బాధపడుతున్నటువంటి సమస్యలలో దంతక్షయ సమస్య కూడా ఒకటి. చాలామంది చిన్నపిల్లలు చాక్లెట్ ఐస్ క్రీమ్ సరిగా నీళ్లు తాగకపోవడం వల్ల చిన్న పిల్లలలో కూడా ఈ దంత క్షయం ఏర్పడుతుంది. అయితే ఈ పుచ్చిన పన్ను కారణంగా తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఉపశమనం కోసం ప్రతిరోజు ఇలా చేస్తే చాలు.
ఇలా దంత క్షయం నొప్పి నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు ఉదయం రాత్రి తప్పనిసరిగా బ్రష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఏదైనా తిన్నప్పుడు మనం నోటిని పుక్కలించుకోవడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి బాధపడవచ్చు.అదేవిధంగా ఎక్కువగా ఔషధ గుణాలు అలాగే పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు.
Tooth Decay:
ఇకపోతే ఇలా పుచ్చిన పంటి నొప్పి సమస్య నుంచి బయటపడాలి అంటే చెరుకు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. చెరుకును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ప్రతిరోజు కొంత సమయం పాటు ఆ చేరుకుని బాగా నమిలి మింగటం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ విధంగా ప్రతిరోజు ఒక చిన్న పది చెరకు ముక్కలను నమలడం ఎంతో మంచిది.