Tollywood : వీళ్ళు రాజమౌళిని టచ్ చేస్తారా..?

Tollywood : బాహుబలి సిరీస్ తర్వాత అందరి టార్గెట్ పాన్ ఇండియా సినిమా అయిపోయింది. దర్శకుడికి ఆ రేంజ్ సక్సెస్ కావాలి. హీరోకి అదే రేంజ్ క్రేజ్ కావాలి. హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా లెవల్‌లో పాపులారిటీ సాధించాలని ఆరాటపడుతున్నారు. దీనికి కారణం దర్శక ధీరుడిగా టాలీవుడ్‌లో అసాధారణమైన పాపులారిటీని తెచ్చుకున్న రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా మారి ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఇప్పుడు ఆయన సినిమా అంటే ప్రపంచ దేశాలలోని టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత నుంచి మన సౌత్‌లో చాలామంది దర్శకులు ఆయన స్థానానికి చేరుకోవాలని, ఇంకా చెప్పాలంటే అంతకుమించిన పాపులారిటీని దక్కించుకోవాలని తపన పడుతున్నారు. వాళ్ళెవరో ఓసారి చూద్దాం..

tollywood-Will they touch Rajamouli?

Tollywood : ప్రశాంత్ నీల్ టార్గెట్ టాలీవుడ్ హీరోలేనా..?

టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా సౌత్‌లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్‌తో ఆయన పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారారు. చెప్పాలంటే ఇంచుమించు రాజమౌళి రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నట్టే అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఉంది. అందుకే మన స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారు ప్రశాంత్ నీల్ కథ కోసం రెడీగా ఉన్నారు. అయితే, ఈయన రాజమౌళీని మించడం సాధ్యమా కాదా..అనేది ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న “సలార్” సినిమాతో తేలిపోతుంది.

tollywood-Will they touch Rajamouli?

Tollywood : ప్రభాస్‌తో “ప్రాజెక్ట్ K” అంటే రాజమౌళిని దాటేసినట్టేనా..?

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్‌లో ఒకటి ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రం “ప్రాజెక్ట్ K”. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నుంచి ఇలాంటి భారీ చిత్రం, అది కూడా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొన్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతుండటం మరో ఆసక్తికరమైన విషయం. అయితే, ఈ సినిమా మన టాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది అందరిలో ఉన్న సందేహం. ఒకవేళ నాగ్ అశ్విన్ గనక “ప్రాజెక్ట్ K” మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో సక్సెస్ అందుకుంటే ఇంచుమించు జక్కన్న పక్కన స్థానం సంపాదించినట్టే అనుకోవాలి.

tollywood-Will they touch Rajamouli?

Tollywood : వైల్డ్ కాన్సెప్ట్స్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అనిపించుకుంటారా..?

సందీప్ రెడ్డి వంగా..టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకి రౌడీ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకుడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన “అర్జున్ రెడ్డి” సినిమా ఎంతటి సంచలం సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. వైల్డ్ యానిమల్ లాంటి క్యారెక్టర్ అయినా కూడా అన్నీ ఎమోషన్స్ పక్కాగా ఉండేలా “అర్జున్ రెడ్డి” సినిమా కథ, కథనాలు ఉండటంతో బూతులు, మితి మీరిన శృంగారపు సన్నివేశాలున్నా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా మన స్టార్ హీరోలు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయడానికి ఆలోచించారు. ఇదే “అర్జున్ రెడ్డి” కథను బాలీవుడ్‌లో తీసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు హిందీలో ఆయన మరో సినిమా తీస్తున్నారు. అలాగే, తెలుగులో కూడా హీరోలను ఇంప్రెస్ చేస్తూ ప్రాజెక్ట్ లాక్ చేసుకుంటున్నారు. కానీ, ఆయన స్కేల్ రాజమౌళి రేంజ్‌కి తీసుకెళుతుందా..? అనేది మాత్రం సందేహమే.

tollywood-Will they touch Rajamouli?

Tollywood : లెక్కల మాస్టారు లెక్కలన్నీ సరిగ్గానే ఉంటున్నాయా..?

టాలీవుడ్‌లో లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’, ‘జగడం’, ‘1 నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలతో ఓ బ్రాండ్ సంపాదించుకున్న సుక్కూ, ‘పుష్ప’ సినిమాతో ఎవరూ ఊహించని లెవల్‌కి వెళ్ళిపోయారు. 5 భాషలలో రిలీజ్ అయిన ‘పుష్ప’ ఆయా భాషల్లో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ళు రాబట్టింది. ముఖ్యంగా హిందీలో ఈ సక్సెస్ ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు సుక్కూ పుష్ప 2 తో మరో స్థాయికి చేరుకోవాలని తాపత్రయపడుతున్నారు. అయితే, ఇంకా ఆయన సినిమా రాజమౌళి స్కేల్‌కి చాలా దూరంలో ఉంది. చూడాలి మరి ‘పుష్ప 2’ తో అది చేరడం సాధ్యమేనా.

tollywood-Will they touch Rajamouli?

ఇలా ఇప్పుడు ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా మిగతా భాషలలోనూ చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాతో రాజమౌళీకి దక్కిన స్థానాన్ని అధిగమించాలని ఆరాటపడుతున్నారు. అది ఎంతమందికి సాధ్యమవుతుందో రానున్న కాలంలో తెలియనుంది. కాగా, ప్రస్తుతం రాజమౌళి “ఆర్ఆర్ఆర్” మూవీ అవార్డ్స్ అందుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి సంబంధించిన పనుల్లోనూ బిజీగా ఉన్నారు.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

3 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.