Tollywood : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కష్టాలు, సుఖాలు, కామెంట్స్, అప్రిసియేషన్స్..ఇలా అన్నీ ఎంజాయ్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. సూపర్ స్టార్ కృష్ణకి మాత్రమే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పేరుండేది. ఆ తర్వాత ఏ హీరోను, దర్శకుడిని అలా డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలవలేదు. అలా పిలిపించుకున్న దర్శకుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు పూరి.
ఈ సినిమా మొదట ఫ్లాప్ అనే టాక్ వచ్చినా మెల్లగా ఆ టాక్ మారి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి పవన్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీలా నిలిచింది. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. అయితే, పూరి కెరీర్‌లో సినిమాల ఫ్లాప్ కంటే కూడా ఆయన నమ్మిన వాళ్ళ వెన్నుపోటు గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటుంటారు. ఓ దర్శకుడిగా సంపాదించిన 100 కోట్ల రూపాయలను పోగొట్టుకోవడం అంటే దీనిని పిచ్చో వెర్రో అమాయకత్వమో నిర్ణయించలేనిది.
అన్నీ పోగొట్టుకొని రోడ్డుమీదకొచ్చిన వారెవరైనా పిచ్చోళ్ళవుతారంటే సందేహం లేదు. కానీ, పూరి సంపాదన..పేరును తలకెక్కించుకోరు. కొన్ని గంటలు బాధపడి ఓ సిగరెట్ తాగి రీచార్జ్ అయిపోతారు. అదే చేశారు. అప్పుడే ఆయన నుంచి మళ్ళీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. పూరికి హిట్ ఫ్లాప్స్ సమానంగా ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం అలాగే ఉంది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ లాంటి అగ్ర రచయిత, దర్శకుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలను రూపొందించి దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకుకున్న కొడుకు రాజమౌళి ఫొటోను కూడా తన మొబైల్ డీపీగా పెట్టుకోకుండా పూరి ఫొటోను పెట్టుకోవడం అంటే ఎంతటి అభిమానమో అర్థమవుతుంది. పూరి హీరోలకి, తోటి దర్శకులకి ఓ వ్యసనం అని చెప్పక తప్పదు. అందరూ ఆయన ఉండాలని ట్రై చేస్తారు. కానీ అది అంత సులభం కాదు.
ఇంత పేరున్నాకూడా కొన్ని సందర్భాలలో చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకూ కథ వినడానికి మొహం చాటేస్తున్నారు. దీనికి కారణం పూరి తీస్తున్న రొటీన్ ఫార్ములా కథలే అని చెప్పక తప్పదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన పూరి, మళ్ళీ లైగర్ డిజాస్టర్‌తో అగాధంలోకి కూరుకుపోయారనే టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత దీనికి సీక్వెల్ అనుకున్నారు.
ఆ తర్వాత బాలయ్యతో సినిమా, మెగాస్టార్‌తో, మెహేష్ బాబుతో, రవితేజతో..ఇలా దాదాపు అందరు స్టార్స్‌తో పూరి ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు పూరి హీరో ఎవరనేది డైలమాగా ఉంది. డ్రీమ్మ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయింది. లైగర్ తర్వాత పూరీ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయని చెప్పుకుంటున్నారు. అయితే, పూరి బయట హీరోలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా దృష్టిపెడితే కొడుకు చాలు. అప్పట్లో పూరి ఫ్లాప్స్‌లో ఉండే తమ్ముడు సాయి రామ్ శంకర్‌ను హీరోగా పరిచయం చేసి 143 మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అలాగే, ఓ లుక్ కొడుకుపై వేస్తే ఇంకో హీరో అవసరం లేదు అనుకోవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.