Tollywood : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది సంగీత దర్శకులకి ఆస్కార్ వస్తుందని ఎన్నో సందర్భాలలో మాట్లాడుకున్నారు. కానీ, ఆస్కార్ రావడం అంత సులభం కాదు. ఇప్పటి వరకూ మ్యూజిక్ మాస్ట్రోగా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న సంగీత దర్శకులు ఇళయరాజా గారికే ఆస్కార్ దక్కలేదు. అంతకంటే సీనియర్ సంగీత దర్శకులదీ అదే పరిస్థితి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ దక్కించుకున్న సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్.
ఆయనకెప్పుడో ఆస్కార్ అవార్డ్ దక్కింది. మళ్ళీ ఇంతకాలానికి ఎం ఎం కీరవాణి కి ఆస్కార్ అవార్డ్ దక్కడం గొప్ప విషయం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి గానూ ఆస్కార్ అవార్డ్ దక్కడం గొప్ప విషయం. అయితే, కీరవాణి కంటే అద్భుతమైన సినిమాలకి సంగీతం అందించిన వారు చాలామంది ఉన్నారు. మెలోడి బ్రహ్మ గా పిలుచుకునే సంగీత దర్శకుడు మణిశర్మ.
Tollywood : వీరికి ఆస్కార్ అందుకునే సత్తా లేదనే మాట గట్టిగా వినిపిస్తుంది.
ఆయన సినిమాలన్నీ అటు సాంగ్స్ పరంగా ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి పేరు ఉంది. కేవలం సాంగ్స్ ఓ సంగీత దర్శకుడితో చేయించుకొని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మతో చేయించుకున్న మేకర్స్..ఆ సినిమాలు చాలా ఉన్నాయి. గోపీ సుందర్, యువన్ శంకర్ రాజా లాంటి వారు అటు తమిళ సినిమాలే కాకుండా తెలుగులోనూ ఊపు ఊపేస్తున్నారు. ఇక ప్రస్తుతం మ్యూజిక్ సెన్షేషన్స్ అనిపించుకుంటున్న ఎస్ ఎస్ థమన్, అనిరుధ్ రవిచందర్ సౌత్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్నారు.
కానీ, వీరికి ఆస్కార్ అందుకునే సత్తా లేదనే మాట గట్టిగా వినిపిస్తుంది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గురించి సౌత్ లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథలో అంత దమ్ము లేదని తెలిసి కేవలం దేవీ సంగీతం మీద ఆధారపడి తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. దేవీ మ్యూజిక్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా మ్యూజికల్ హిట్ అని అందరూ ఫిక్స్ అయిపోతారు. అంత క్రేజ్ దేవీకి ఉంది. కానీ, ఇప్పటి వరకూ రాక్ స్టార్ ఆస్కార్ అందుకునే స్థాయికి రాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఆస్కార్ లెక్కలేమో గానీ ఆ అవార్డ్ అందుకోవాలని అన్నీ విభాగాలలోని టెక్నీషియన్స్ రాత్రింబవళ్ళు కలలు కంటున్నారు.