Tollywood : యూత్‌స్టార్ నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుమల కాంబినేషన్‌లో ఉగాది పండుగ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. గతంలో ఇదే కాంబోలో వచ్చిన భీష్మ మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అప్పటికి నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకీ కుడుమల, రష్మిక మందన్నలతో కలిసి చేసిన భీష్మ నితిన్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నితిన్ ఖాతాలో పెద్ద సక్సెస్ అనేది చేరలేదు. కానీ, రష్మిక మాత్రం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా మారింది.
వెంకీ కుడుమలకీ మళ్ళీ సాలీడ్ ప్రాజెక్ట్ తగల్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అలాగే, రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, మళ్ళీ నితిన్-రష్మికలతోనే తన నెక్స్ట్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రష్మిక, వెంకీ కుడుమల కంటే కూడా నితిన్ కెరీర్‌కి చాలా అవసరం. చేయడాని ఈ యూత్‌స్టార్ వరుసగా సినిమాలు చేశాడు గానీ, ఒక్కటి కూడా భారీ హిట్ సాధించలేదు.
Tollywood : లక్కీ స్టార్ నితిన్ కోసం డేట్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్..
గత చిత్రం మాచర్ల నియోజకవర్గం మీద నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమా జనాలకి ఏమాత్రం నచ్చలేదు. ఈ సినిమా తర్వాత నితిన్ కొత్త కథలు విన్నా వాటిని ఫైనల్ చేసుకోలేకపోయాడు. చాలా ఆలోచించి ఫైనల్‌గా హిట్ జోడీనే సెట్ చేశాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా నితిన్‌కి హిట్ పడాలి. లేదంటే రేస్‌లో ఇంకా వెనకబడిపోతాడు. లవ్ కం కమర్షియల్ సినిమా తీయడంలో వెంకీ కుడుమల సిద్ధహస్తుడు అని ఛలో, భీష్మ సినిమాలతో తేలిపోయింది.
ఇక రష్మిక ఉంటే సినిమా గ్యారెంటీ హిట్ అనే ముద్ర పడిపోయింది. ఐకాన్ స్టార్ సరసన చేసిన పుష్ప మూవీతో రష్మిక మందన్న రేంజ్ అమాంతం పెరిగింది. బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ వరుసగా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇలాంటి లక్కీ స్టార్ నితిన్ కోసం డేట్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గానూ మారింది. ఏదేమైనా ఈ హిట్ కాంబోలో కొత్త సినిమా అంటే మంచి బజ్ మాత్రం క్రియేట్ అయింది. చూడాలి మరి ఈ సినిమా నితిన్‌కి ఎంతవరకూ కలిసొస్తుందో.