Tollywood: సమంత, నాగ చైతన్యలను వాళ్ళు కావాలనే టార్గెట్ చేశారు..! అంటూ ఓ వార్త ప్రస్తుతం నెట్టించ హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ వీరిని టార్గెట్ చేసిందెవరో ఆ కథేంటో చూద్దాం. ఏ మాయ చేశావే సినిమాలో సమంత, నాగ చైతన్య మొదటిసారి కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు.
ఏ మాయ చేశావే సినిమా తర్వాత సమంత, నాగ చైతన్య నటించిన ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా లిప్ కిస్ ఉండేది. అది ఉంటేనే సినిమా హిట్ అని ఫిక్సైపోయారు. ఇక 2017లో సమంత, చైతూ రెండు మత సాంప్రదాయాల ప్రకారం ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏమైందో గానీ 2021 లో విడిపోయారు. ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు.
Tollywood: సమంత, నాగ చైతన్యలను ట్రోల్ చేసిన విషయమూ తెలిసిందే.
అప్పటి నుంచి ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కొందరూ సోషల్ మీడియా ద్వారా సమంత, నాగ చైతన్యలను ట్రోల్ చేసిన విషయమూ తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది. అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ఎందుకో సమంత, నాగ చైతన్యల మీద పగ పట్టినట్టుగా ప్రవర్తిస్తోంది. వీరిద్దరు వేరు వేరుగా నటించిన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.
సమంత నటించిన సీటాడెల్, నాగ చైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ లు ఇప్పటి వరకూ అమెజాన్ వారు రిలీజ్ చేయలేదు. దాదాపు రెండేళ్ళ నుంచి పక్కన పెట్టేశారు. మరి ఎందుకింత అక్కసు వీరి మీద అర్థం కావడం లేదు. ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ అయితే అది ఎప్పుడో సాల్వ్ అయి ఉండేది. మరి దీనికి కారణం ఏంటో, ఎప్పుడు ఈ రెండు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతాయో చూడాలి.