Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం గ్యాప్ లేకుండా ఒక్కో సినిమా షూటింగ్ కి డేట్స్ ఇస్తూ తన పార్ట్ వరకూ చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. కానీ, ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందనేది మాత్రం కాస్త కన్‌ఫ్యూజన్ గా ఉంది. ఇంతకీ ప్రభాస్ రాజు నుంచి నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఏదీ..?
సలార్, కల్కీ చిత్రాల తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త చిత్రం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే మారుతి దర్శకత్వంలో కమిటైన ది రాజాసాబ్ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ కూడా రిలీజై డార్లింగ్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు..కామన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా…? ఆశగా ఎదురు చూస్తున్నారు.

Tollywood: ప్రభాస్ లుక్ కూడా రివీల్ అయింది.
ది రాజాసాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడో మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ లేదు. ఇంతలోనే ఫౌజీ చిత్రం ఒప్పుకున్న ప్రభాస్ సెట్స్ మీదకి కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుండగా ఈ మూవీలో ప్రభాస్ లుక్ కూడా రివీల్ అయింది. ది రాజాసాబ్ లో లాంగ్ హేయిర్ తో కనిపిస్తే ఇందులో మరో ట్రెండీ లుక్ లో వావ్ అనిపించారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ది రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్, కల్కీ 2 ఉన్నాయి. వీటిలో ది రాజాసాబ్ ముందు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ విడుదలకి సిద్ధం అవుతుండగా..ఆ తర్వాత వచ్చే సినిమాల లైనప్ ఏంటో క్లారిటీ లేదు.

అందరూ సలార్ 2 అని భావిస్తున్నారు. కానీ, అది సాధ్యపడేలా లేదు. దీనికి కారణం సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్‌టి్ఆర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే పనిలో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి సలార్ 2 ఇప్పట్లో సెట్స్ మీదకి రావడం కష్టమే.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయాల్సిన కల్కీ సీక్వెల్ కి కూడా మేకింగ్ పరంగా చూసుకుంటే చాలానే సమయం పడుతుంది. దీన్ని బట్టి చూస్తే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన స్పిరిట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కల్కీ సీక్వెల్ దీని తర్వాత సలార్ 2 వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. చుడాలి మరి ఈ లైనప్ లో మళ్ళీ ఏమైనా మార్పులుంటాయేమో.